మే 15 నుండి18 న తిరుపతిలో జరిగే ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసథలు జయప్రదం చేయాలి
ఏఐవైఎఫ్ రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి సంతోష్ కుమార్ పిలుపు
న్యూస్ తెలుగు/అనంతపురం : ఏప్రిల్ 12 న్యూస్ మే 15 నుండి18 న తిరుపతిలో జరిగే ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసథలు జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ శనివారం విలేకరుల సమావేశంలో జాతీయ మహాసభల వాల్ పోస్టర్లను సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మాజీ మున్సిపల్ చైర్మన్ నూర్ మొహమ్మద్ మాజీ ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ మాజీ విద్యార్థి నాయకుడు రిటైర్డ్ మాస్టర్ జెక్రియ పలువురు అనంత ప్రముఖులచే విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొట్రేష్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సంతోష్ కుమార్ అనంతపురం సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ… కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం తమ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టి 11 సంవత్సరాలు కావిస్తున్న ఉద్యోగాలు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఉద్యోగాల పీకేస్తూ దేశానికి తలమానుకులైనటువంటి త్రివిధ దళాలు కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే ప్రయత్నం చేశారన్నారు. యువతను మతం పేరుతో రెచ్చగొడుతూ మనుషుల మధ్య తారతమ్యాలను ఆపాదిస్తూ వారిని కులం పేరుతోనూ మతం పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల కల్పన చేయకపోగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, రైల్వే, బ్యాంకింగ్, ఎయిర్ పోర్ట్, పోర్టులు ప్రవేట్ కంపెనీలకు అప్పనంగా అప్పజెప్తో ఉన్న ఉద్యోగాలు కూడ ఊడ కొడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. డబల్ ఇంజన్ సర్కార్ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉద్యోగాలు కల్పనలో వైఫల్యం చెందిందన్నారు. 2024 ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ పైన మొదటి సంతకం చేస్తానని హామీ ఇచ్చి సంతకం చేసి నోటిఫికేషన్ మరచిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న నేపథ్యంలో యువతల ఉద్యమ స్పూర్తి నెలకొల్పడానికి తిరుపతిలో మే 15 నుండి 18 వరకు జరిగే అఖిల భారత యువజన సమాఖ్య 17వ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జాతీయ మహాసభల్లో మొదటి రోజు మే10 వేలాది మందితో ర్యాలీ బహిరంగ సభ నిర్వహించి అనంతరం మూడు రోజులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి 1000 మంది ప్రతినిధులతో మహాసభలో దేశవ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పైన చర్చించి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందించడానికి మహా సభలు వేదిక కానున్నాయన్నారు. ఈ మహాసభ కి అధిక సంఖ్యలో యువతీ యువకులు నిరుద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ నూర్ మొహమ్మద్, హ్యూమన్ రైట్స్ స్టేట్ జకిర్ హుస్సేన్, రిటైర్డ్ హెచ్ఎం జాకీర్, బంగారు భాష, ఖాజా, ఏఐవైఎఫ్ జిల్లా కోశాధికారి శ్రీనివాస్ , నాయకులు కుమార్, రాంబాబు, అశోక్ సురేంద్ర నాగయ్య తదితరుల పాల్గొన్నారు.(Story : మే 15 నుండి18 న తిరుపతిలో జరిగే ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసథలు జయప్రదం చేయాలి )