గాస్పల్ హాల్ అసెంబ్లీ చర్చి నుండి జిహెచ్ ఫిలిప్, రిటైర్డ్ ఎంఈఓ విజయ్ కుమార్ బహిష్కరణ
న్యూస్‌తెలుగు/అనంతపురం : స్థానిక గాస్పల్ హాల్ అసెంబ్లీ చర్చ్ నందు ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘ పెద్దగా ఉన్నటువంటి జిహెచ్ ఫిలిప్, రిటైర్డ్ ఎంఈఓ విజయ్ కుమార్ అనేక అక్రమాలకు పాల్పడడంతో ఇద్దరినీ బహిష్కరిస్తున్నట్లు స్థానిక సంఘ సంఘ కాపరి టిపి వరప్రసాద్ రెడ్డి, సంఘ పెద్దలు ఆదినారాయణ, ఆసాఫ్ హేరాల్డ్, దేవవరం, సంఘ సభ్యులు కాంతి ఐజక్ అరోరా,రూబేన్, కాంతి జాన్ వెస్లీ, ప్రసాద్ మరియు సంఘ సభ్యులు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. సహోదరుడు జిహెచ్ ఫిలిప్ నిరంకుశ ధోరణిలో తోటి సంఘ పెద్దలను పక్కనపెట్టి తన ఇష్టం వచ్చినట్లు చర్చి యొక్క డబ్బులను పక్కదోవ పట్టించి లెక్కలు చూపకుండా చర్చి డబ్బులు వాడుకున్నట్లు స్థానిక సంఘ పెద్దలు తెలియజేశారు. గాస్పల్ హాల్ అసెంబ్లీ స్థాపింపబడినప్పటి నుండి కోర్ట్ రోడ్లో నందు గల ఆంధ్ర బ్యాంకు లో బ్యాంకు ఖాతాను ప్రారంభించడం జరిగిందన్నారు. జిహెచ్ ఫిలిప్ ఆంధ్రా బ్యాంకులో గల చర్చి బ్యాంకు ఖాతాను తన ఇంటి దగ్గరలో జేఎన్టీయూ వద్ద ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుకు మార్చుకోవడం జరిగింది. సంఘ పెద్దలు అందరూ ఆ బ్యాంకు ఖాతాను చర్చి దగ్గరలో ఉన్న ఆంధ్ర బ్యాంకు లోకి తిరిగి మార్చవలసిందిగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వారిని కోరడం జరిగిందన్నారు. జెఎన్టియు వద్ద గల ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో జిహెచ్ ఫిలిప్ కొత్త బ్యాంకు ఖాతాను ప్రారంభించి పాత బ్యాంకు ఖాతాలోని నగదును కొత్తగా ప్రారంభించిన బ్యాంకు ఖాతాలో దాదాపు 40 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుకున్నారు అని పేర్కొన్నారు. తిరిగి చర్చి వారందరూ ఈ డిపాజిట్లు విషయం తెలుసుకుని కోర్టు రోడ్డులోగల ఆంధ్ర బ్యాంకుకు ఆ నగదును ట్రాన్స్ఫర్ చేయాలని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వారికి లేఖ రాయడం జరిగిందన్నారు. ఇంతవరకు ఆ నగదును ఆంధ్ర బ్యాంకులో ట్రాన్స్ఫర్ కాకుండా జిహెచ్ ఫిలిప్ ఆ బ్యాంక్ మేనేజర్ తో కుమ్మక్కై నగదు ట్రాన్స్ఫర్ కాకుండా ఆపారు అని పేర్కొన్నారు. సంఘ పెద్దలకు నగదు వివరాలను తెలుపకుండా తన ఇష్టానుసారం చర్చి యొక్క మీటింగ్స్ హాజరు కాకుండా బ్యాంకు లావాదేవీలు చర్చికి తెలుపకుండా ప్రవర్తిస్తున్న కారణంగా సంఘ పెద్దలందరూ గట్టిగా అడగడంతో తను చర్చికి రాకుండా వేరే చర్చ్ ప్రారంభించి గాస్పల్ హాల్ అసెంబ్లీకు చెందిన నగదును తను తీసుకొని వెళ్ళిపోయారు అని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం కూడా పూర్తి కావడంతో నేడు సంఘ పెద్దలందరూ జిహెచ్ ఫిలిప్ ను బహిష్కరిస్తున్నట్లు ఈ విలేకరుల సమావేశంలో ప్రకటించారు జిహెచ్ ఫిలిప్ గాస్పల్ అసెంబ్లీ పేరుతో తన ఇంటి అడ్రస్ పెట్టుకొని సొసైటీ స్థాపించారు చర్చి అడ్రస్ కాకుండా తన ఇంటి అడ్రస్ ను అందులో పెట్టడం జరిగింది తర్వాత నేటి వరకు ఎటువంటి కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయకుండా తనకు సంబంధించిన వారిని ఆ కమిటీలో వేసుకొని గాస్పల్ అసెంబ్లీ సొసైటీ నాదే అని చెప్పుకుంటూ ఫారిన్ ఫండ్స్ కూడా వసూలు చేస్తున్నాడని మా దృష్టికి వచ్చింది కావున సంఘం అందరూ కలిసి జిహెచ్ పిలుపును గాస్పల్ హాల్ అసెంబ్లీ సంఘం నుండి బహిష్కరిస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగిందన్నారు. తదుపరి ఈ బ్యాంకు నగదుకు సంబంధించిన త్వరలోనే చట్టపరంగా ముందుకు వెళ్తామని సంఘ పెద్దలు, సంఘ సభ్యులు తెలిపారు. (Story : గాస్పల్ హాల్ అసెంబ్లీ చర్చి నుండి జిహెచ్ ఫిలిప్, రిటైర్డ్ ఎంఈఓ విజయ్ కుమార్ బహిష్కరణ)