సైట్ సమస్య వల్ల రాజీవ్ వికాస్ పథకం గడువు పెంచాలి: సిపిఐ
న్యూస్‌తెలుగు/వనపర్తి: రాజీవ్ వికాస్ పథకం కు యువత దరఖాస్తు చేసుకునేందుకు రాజీ వికాస్ పథకం సైట్ ఓపెన్ కాక చాలామంది దరఖాస్తులు చేయలేదని, దరఖాస్తు కు గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించాలని సిపిఐ వనపర్తి పట్టణ కార్యదర్శి రమేశ్, జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం సిపిఐ ఆఫీస్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో ఏప్రిల్ 5 వ తేదీ వరకు దరఖాస్తుకు చివరి తేదీ ఉండగా దాన్ని ఏప్రిల్ 14 కు పొడిగించారన్నారు. కానీ ఏప్రిల్ 12, 13, 14 తేదీలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు అన్నారు. రాజీవ్ వికాస పథకానికి దరఖాస్తు చేసుకునేవారు దరఖాస్తుకు ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్లు తప్పక జత చేయవలసి ఉంటుందన్నారు. గత కొద్దిరోజులుగా ఎమ్మార్వో ఆఫీస్ లోని ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్లు జారీ చేసే సైట్ కూడా సమస్య వల్ల సకాలంలో దరఖాస్దారులు సర్టిఫికెట్లు పొందలేకపోయారన్నారు. అర్హత గల ప్రతి నిరుద్యోగి దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గడువును ఏప్రిల్30 వరకు పొడిగించడం సముచితన్నారు. అంతేగాక సైట్ సమస్యను అవకాశం గా తీసుకొని కొన్ని మీసేవ కేంద్రాల్లో దరఖాస్తుదారుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. దరఖాస్తు చేయాలంటే రూ. 500లకు పైగా ఖర్చవుతుందని చెబుతున్నారన్నారు.ఇలాంటి మీ సేవ కేంద్రాలపై అధికారులు చర్య తీసుకోవాలన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎర్రకుర్మయ్య, నేతలు జయమ్మ, శిరీష, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. (Story :సైట్ సమస్య వల్ల రాజీవ్ వికాస్ పథకం గడువు పెంచాలి: సిపిఐ)