రాజన్న దొరకు అభినందనలు
న్యూస్ తెలుగు/సాలూరు : వైయస్సార్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్సార్ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పిఎసి)ని ప్రకటించారు ఇందులో చోటు దక్కినందుకు ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ గిరిజన శాఖ మాత్యులు పీడిక రాజన్న దొర నియమితులయిన సందర్భంగా ఆయనను జిల్లా నియోజకవర్గనికి చెందిన వైయస్సార్ అభిమానులు ఆయన స్వగృహానికి వచ్చి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా రాజన్న దొర మాట్లాడుతూ. వైయస్సార్ సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. (పిఏసి)లో 33 మందిని నియమించారు.అందులో నన్ను కూడా ఎంపిక చేసినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని తెలిపారు. అహర్నిశలు కష్టపడి పార్టీకి పూర్వవైభం వచ్చేలా కృషి చేస్తానని అన్నారు. నాకు అభినందనలు తెలియజేసిన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరునా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని తెలిపారు. (Story : రాజన్న దొరకు అభినందనలు)