దిల్ సుఖ్ నగర్ బాంబు బ్లాస్ట్ కేసులో హైకోర్టు తీర్పు పై హర్షం వ్యక్తం చేసిన ఘటనలో గాయపడిన బాధితుడు – దుర్గ ప్రసాద్
న్యూస్ తెలుగు/ చింతూరు : తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఇవాళ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించడం ఆ ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధించడం పై హర్షం వ్యక్తం చేశారు ఆ ఘటనలో గాయపడిన బాధితుడు అల్లూరి జిల్లా చింతూరు గ్రామానికి చెందిన పురాలేశెట్టి దుర్గ ప్రసాద్.చింతూరు 2013 ఫిబ్రవరి 21న బస్ స్టాండ్, మిర్చిపాయింట్ వద్ద జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మరణించారని, నాలాంటి వారు 131 మంది గాయపడ్డమని ఉగ్రవాదులు సృష్టించిన ఈ మారణహోమం ఇప్పటికీ నన్ను పీడ కలల వెంటాడుతుందని ఈ ఘటన జరిగిన 12 ఏళ్ల తర్వాత ఈ కేసులో ఇవాళ హైకోర్టు కీలక తీర్పును వెలువరించిందని ఉగ్రవాదులైన ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధించడం పై అనందం వ్యక్తం చేసారు. ఎన్నో ఆశలతో మా జీవితాలు ఉన్నంతంగా ఎదగాలని అనుకుంటున్న తరుణంలో ఘటనలో బాధితులమై జీవితాన్ని కోల్పోయామని మమ్మల్ని ఇప్పటి వరకు ఎ ప్రభుత్వం ఆదుకోలేదని ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించి మాకు తగు న్యాయం చేయాలనీ కోరారు.(Story : దిల్ సుఖ్ నగర్ బాంబు బ్లాస్ట్ కేసులో హైకోర్టు తీర్పు పై హర్షం వ్యక్తం చేసిన ఘటనలో గాయపడిన బాధితుడు – దుర్గ ప్రసాద్ )