మహా సంఘసంస్కర్త డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్
కూటమి నాయుకుల ఆధ్వర్యంలో
న్యూస్ తెలుగు/వినుకొండ : స్వాతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు కూటమి నాయకులు శనివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మక్కెన మాట్లాడుతూ. బాబూ జగ్జీవన్ రామ్ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమ కోసం అలుపెరుగని కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగుతుందన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలను ఆదుకుంటూ పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి న్యాయం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు యార్లగడ్డ లెనిన్ కుమార్,శ్రీనివాసరావు, పెమ్మసాని నాగేశ్వరరావు, పి.వి. సురేష్ బాబు, దాసయ్య, తదితరులు పాల్గొన్నారు.

మునిసిపాలిటీ ఆధ్వర్యంలో..
బాబు జగ్గజీవన్ రామ్ జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులు అర్పించిన మునిసిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మరియు సిబ్బంది.

ఆరోగ్య మిత్ర ఆధ్వర్యంలో..
సమతవాది స్వతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి ఉత్సవాలు వినుకొండ పట్టణంలోని మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా ఉన్న విగ్రహానికి పూలదండలు వేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. మాదిగ ఉద్యోగుల సమైక్య వర్కింగ్ ప్రెసిడెంట్ మాచర్ల బుజ్జి మాట్లాడుతూ. 30 సంవత్సరాలు కేంద్రంలో అనేక శాఖలకు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఓటమి ఎరగని వ్యక్తి, రాజకీయ దురంధరుడు, అంటరానితనాన్ని రూపుమాపిన వ్యక్తి, బీహార్ లోని చాంద్వా పట్టణంలో 1908 ఏప్రిల్ 5వ తారీఖున జన్మించారు. ఆ రోజుల్లో కుల వీక్షతను నిర్మూలించడానికి అనేక పోరాటాలు చేశారు. అదేవిధంగా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి వ్యక్తులు వద్ద కార్మిక,ఆహార రైల్వే, సమాచార మరియు భారతదేశ ఉప ప్రధానిగా పనిచేశాడని, అటువంటి వ్యక్తికి ప్రధాన మంత్రి మోడీ వెంటనే భారతరత్న ప్రకటించాలని, మాదిగ ఉద్యోగుల సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం అధ్యక్షులు నేలపట్ల శ్యామ్ వరప్రసాద్, ఏనుగుపాలెం కెనరా బ్యాంక్ మేనేజర్ మహేష్, పిటి మాస్టర్ పాపారావు, సంతోష్ మాస్టర్, అవి కలం తెరిసా టూషన్ సెంటర్ విద్యార్థులు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

వినుకొండ చర్చ్ ఆఫ్ క్రిస్ట్ సంస్థ ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ…
వినుకొండ చర్చ్ ఆఫ్ క్రిస్ట్ సంస్థ వారి ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు 117 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండ ప్రభుత్వ హాస్పిటల్ నందు రోగులకు మరియు బాలింతలకు పండ్లు బ్రేడ్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధ్యక్షులు యం. డి. రాజు మరియు డాక్టర్ శ్రీనివాసరెడ్డి చేతుల మీదగా బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. బాబు జగ్జీవన్ రావ్ ఉప ప్రధానిగా ఉండగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ ఎం.ప్రవళిక, ట్రెజరర్ రమేష్, ఎం. బ్రహ్మయ్య, టి. శ్రీను, ఏ. బెంజిమెన్, వైద్యశాల సిబ్బంది సిస్టర్స్ పాల్గొన్నారు.
(Story :మహా సంఘసంస్కర్త డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ )

