పి సి పి ఎన్ డి టి యాక్టివ్ పై సబ్ డివిజన్ కమిటీ సమావేశం
న్యూస్ తెలుగు/అనంతపురం : ఆర్డీవో కేశవ నాయుడు అధ్యక్షతన పి సి పి ఎన్ డి టి యాక్ట్ అములలో భాగంగా సబ్ డివిజనల్ కమిటీ మీటింగ్ ఆర్ డి ఓ ఆఫీస్ అనంతపురం నందు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డిఓ కేశవనాయుడు మాట్లాడుతూ… భృణ హత్యలపై నిఘా ఉంచి భృణ హత్యలు ప్రోత్సహించిన వైద్యులకు సహరించిన వారికి శిక్షపడేలా చేసి ఆస్పత్రులను వెంటనే సీజ్ చేసి పత్రికా ప్రకటన మూలంగా ప్రజలకు తెలియజేసేలా చూడాలన్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా తన సిబ్బందితో అనంతపురం డివిజన్లోని మందుల షాపులపై దాడి చేసి ఎంటిపి మందులు గైనకాలజిస్ట్ ,ప్రీక్రీప్షన్ లేకుండా ఇచ్చిన మందుల షాపులను సీజ్ చేయవలసినదిగా ఆదేశించారు.ఈ సమావేశం లో గైనకాలజిస్ట్ డాక్టర్ సౌజన్య, చిన్నపిల్లల వ్యూభాగము నుంచి డాక్టర్ రవికుమార్, పేతాలజిస్ట్ డాక్టర్ శ్రావణి, ఆర్డిటి నుంచి డాక్టర్ దుర్గేష్, ప్రోగ్రాం ఆఫీసర్ డా రవిశంకర్ ,వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి శ్రీ యాదవ్, ఐ అండ్ పి ఆర్ నుంచి గురు స్వామి శెట్టి, రెడ్స్ నుంచి భానుజ, హెడ్స్ నుంచి , రామ్మోహన్, ఐసిడిఎస్ నుంచి సంధ్య, డెమో , ఎం త్యాగరాజు, గంగాధర్ ,లీగల్ మానిటర్ కన్సల్టింగ్, ఆషారాణి , సి వెంకటేష్ హెచ్ ఈ, పాల్గొన్నారు.(Story : పి సి పి ఎన్ డి టి యాక్టివ్ పై సబ్ డివిజన్ కమిటీ సమావేశం )