శ్రీచౌడేశ్వరి విగ్రహం ప్రతిష్టకు రావుల ని ఆహ్వానించిన బిఆర్ ఎస్ నాయకులు
న్యూస్‌తెలుగు/ వనపర్తి : చెన్నారం గ్రామంలో ఏప్రిల్ 11 నుండి 14 వరకు యాదవ్ సంఘం అధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ చౌడేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంకు రావాలి అని తెలంగాణా భవన్ లో మాజీ ఎం.పి రావుల చంద్రశేఖర్ రెడ్డిని బిఆర్ఎస్ నాయకులు ఆహ్వానించారని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్ తెలిపారు.ఆహ్వాన పత్రిక అందజేసిన వారిలో మాజీ జెడ్పీటీసీ బోర్ల భీమయ్య మరియు మాజీ సర్పంచ్ రమేష్ యాదవ్ యాదవ్ సంఘం నాయకులు బత్తుల ఆశన్న,సన్న రాజు యాదవ్,సన్న మహేష్ యాదవ్, ప్రవీణ్, విజయ్,మనికంఠ తదితరులు పాల్గొన్నారు. (Story : శ్రీచౌడేశ్వరి విగ్రహం ప్రతిష్టకు రావుల ని ఆహ్వానించిన బిఆర్ ఎస్ నాయకులు)

