శ్రీ చౌడేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ఆహ్వానం
న్యూస్‌తెలుగు/వనపర్తి : ఏదుల మండలం చెన్నారం గ్రామంలో తేదీ 11,12,13,14 ఏప్రిల్ 2025 యాదవ్ లచే నిర్వహిస్తూన్న శ్రీ చౌడేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి హజరవాలని వనపర్తి లోని మాజీ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి చౌడేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వానం పత్రిక అందించారు . ఈ కార్యక్రమంలో చెన్నారం మాజీ సర్పంచ్ రమేష్ యాదవ్, మాజీ యంపిటిసి రాజురెడ్డి, శ్రీ చౌడేశ్వరి మహోత్సవ యాదవ నిర్వహన కమిటీ నాయకులు గంగనమోని చిన్న రాములు, బతుల ఆశన్న,పూడురు బాలయ్య,పూడురు బాల్ చిన్నయ్య,పూడురు మహేష్, బత్తుల మల్లయ్య, బత్తుల మద్దిలేటి బత్తుల సంజీవ్,అప్పల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. (Story :శ్రీ చౌడేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ఆహ్వానం)