చండీగర్ బేస్ బాల్ పోటీలకు వినుకొండ విద్యార్థి బోధనం శ్రీను ఎంపిక
న్యూస్ తెలుగు/వినుకొండ : చండీగర్ బేస్ బాల్ పోటీలకు వినుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి బోధనం శ్రీను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తరఫున ఆల్ ఇండియా గ్లోబల్ యూనివర్సిటీ పోటీలలో సెలెక్ట్ అవడం జరిగింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్, భోదనం శ్రీను కి 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. రాబోయే కాలంలో రాష్ట్ర దేశ స్థాయి పోటీల్లో పాల్గొని విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని నాగ శ్రీను రాయల్ అన్నారు. ఈ కార్యక్రమంలో లెనిన్ మాస్టర్ ,జనసేన పార్టీ అధికార ప్రతినిధి పారెళ్ళ అభిమన్యు , నూజెండ్ల మండలం ఉపాధ్యక్షుడు పసుపులేటి రజబాబు , కామిశెట్టి కిషోర్ , తుమ్మ అనిల్ కుమార్ , లక్ష్మణరావు , బిజెపి నాయకులు మహేష్, మండల కార్యదర్శి గణప రమేష్, గ్రామ అధ్యక్షులు అడపాల చిరంజీవి, తెల్ల మేకల రమేష్, మండల స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : చండీగర్ బేస్ బాల్ పోటీలకు వినుకొండ విద్యార్థి బోధనం శ్రీను ఎంపిక )