Homeవార్తలుతెలంగాణయాసంగి వరి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి

యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి

యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి

న్యూస్ తెలుగు/వనపర్తి : యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.గురువారం ఐడీఓసీ సమావేశ మందిరంలో ఐకేపీ, పీఏసీఎస్, మిల్లుల యజమానులు, రవాణా సంస్థలతో ధాన్యం సేకరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ, రైతుల నుండి ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో రైతులకు షెడ్, కూర్చోడానికి కుర్చీలు, తాగు నీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏదైనా సెంటర్లో మౌలిక సదుపాయాలు లేనిపక్షంలో కమిషన్ నిలిపివేయడం జరుగుతుందని హెచ్చరించారు.ధాన్యం సేకరణలో పారదర్శకత పాటించాలని, రైతులందరికీ మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. మిల్లులకు ధాన్యం తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని, రవాణా సంస్థలు సకాలంలో లారీలను అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించారు.ఏ గ్రేడ్ వరికి రూ. 2320 , సాధారణ రకం ధాన్యానికి రూ. 2300 లు బొనస్ ఇస్తున్నట్లు తెలిపారు. సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం ద్వారా కెయింటాలుకు రూ. 500 బోనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అందువల్ల సన్న రకం, దొడ్డు రకం ధాన్యం కొనుగోలు కేంద్రాలు వేరు వేరుగా కనీసం 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.సన్న రకం ధాన్యం గుర్తించేందుకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు వ్యవసాయ విస్తీర్ణాధికారుల ద్వారా శిక్షణ ఇప్పించాలని సూచించారు.ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నందున తేమ శాతం 14 త్వరగా వచ్చేస్తుందని వెంటనే కొనుగోలు చేసి ధాన్యాన్ని నిర్దేశించిన గోదాములు లేదా మిల్లు కు తరలించాలని సూచించారు. వచ్చిన ధాన్యాన్ని దింపుకొని వెంటనే ట్రక్ షీట్ పంపించాలని, ట్రక్ షీట్ ఆధారంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో అవసరమైన మేరకు టార్పాలిన్ లు, గన్ని బ్యాగులు, తేమ మిషన్లు, ధాన్యం తుర్పారబెట్టే యంత్రాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు.
ఏప్రిల్ , 1 నుండి జిల్లాలో కొన్ని చోట్ల వరి కోతలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని అందువల్ల ఆ లోపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. వరి కోతల యంత్రాలు 19-20 మధ్యలో ఆర్.పి.యం ఉండే విధంగా చూసుకోవాలని ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు కలక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు, జిల్లా సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్,డి.యం. సివిల్ సప్లై జగన్మోహన్, కో ఆపరేటివ్ అధికారి ప్రసాద్ రావు, మార్కెటింగ్ అధికారి స్వరణ్ సింగ్, ఐకేపీ, పీఏసీఎస్ సభ్యులు, మిల్లుల యజమానులు మరియు రవాణా సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.(Story : యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!