ఆహార ఉత్పత్తిలో భారత దేశం భవిష్యత్తులో అగ్రభాగాన నిలుస్తుంది
న్యూస్ తెలుగు/వనపర్తి : వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాల(పెద్దగూడెం,వనపర్తి)ను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సందర్శించి విద్యార్థినులతో ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.వసతుల విషయములో వారు ఎదుర్కొంటున్న సమస్యలు విని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని భరోసా ఇచ్చి రాబోవు కాలంలో మళ్ళీ కె.సి.ఆర్ ప్రభుత్వం వస్తుందని ప్రత్యేక దృష్టి సారించి వ్యవసాయ కళాశాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నేను వ్యవసాయ పక్షపాతినని వ్యవసాయ రంగం భవిష్యత్తులో అన్ని రంగాలకు మార్గదర్శనం అవుతుందని బావించి ఇక్కడ మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశామని అందుకోసం 20ఎకరాల స్థలం కేటాయించి అన్ని వసతులతో అద్భుతమైన కళాశాల నిర్మించాలని కృషి చేశామని కానీ దురదృష్టం ప్రభుత్వం కోల్పోవడం వల్ల అభివృద్ధి ఆగిపోయిందని అన్నారు.కె.సి.ఆర్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విశేషమైన మార్పులు తీసుకురావడం వల్ల తెలంగాణ సుభిక్షంగా మారిందని అన్నారు.విద్యార్థినులను పేరు పేరున పరిచయం చేసుకొని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. శరణ్య అనే విద్యార్థి మాట్లాడుతూ మీ కృషివల్ల మేము ఇక్కడ చదువుకుంటున్నామని లేకపోతే తల్లిదండ్రులకు ఆర్థిక భారమై సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని అందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి,బి.ఆర్.ఎస్ నాయకులు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్,పలుస.రమేష్ గౌడ్,విజయ్ కుమార్,ఉంగ్లం. తిరుమల్,నాగన్న యాదవ్,హేమంత్ ముదిరాజ్,చిట్యాల.రాము,బాగ్యరాజ్,శివ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.(Story : ఆహార ఉత్పత్తిలో భారత దేశం భవిష్యత్తులో అగ్రభాగాన నిలుస్తుంది )