వినుకొండలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ సమీపంలోని కొప్పుకొండ గ్రామంలో రైతు సేవా కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి జి.వరలక్ష్మి, ఉద్యానవన విస్తరణ అధికారి నారాయణ, వెటర్నరీ విస్తరణ అధికారి పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు రిజిస్ట్రేషన్ గూర్చి మరియు భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల వాడకం గూర్చి అవగాహన కలుగజేయటం జరిగింది. భూమిలో సేంద్రియ కర్బన శాతం ఒకటి ఉండునట్లు చూడాలని తద్వారా భూమిలో ఉండే కోటాను కోట్ల సూక్ష్మజీవులు బాగా పనిచేసి భూమిలో నిల్వ ఉన్న పోషక పదార్థాలను మొక్కకు అందుబాటు రూపంలోకి వచ్చినట్లు చేయునని మరియు పచ్చిరొట్ట పైరులైన జీలుగా, జనుము, పిల్లి పెసర లాంటివి సాగు చేసి పూత దశ వరకు ఉంచి భూమిలో కలియుదున్నటం ద్వారా సేంద్రియ పదార్థం పెంపొందించవచ్చని రైతులకు తెలిపారు. రైతులు 31 మార్చి 2025 లోపు ప్రతి ఒక్కరు తమ గ్రామ పరిధిలోని రైతు సేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా అన్నదాత సుఖీభవ ,పీఎం కిసాన్, మరియు వ్యవసాయ శాఖ ద్వారా వచ్చు లబ్ధిని అందుకోవచ్చని అన్నారు. (Story : వినుకొండలో పొలం పిలుస్తుంది కార్యక్రమం)