నూతన పంచాంగాన్ని ఆవిష్కరించిన రావుల
పంచాంగ సిద్ధాంతకర్త మనోహర శర్మకి రావుల సన్మానం
న్యూస్‌తెలుగు/వనపర్తి : ఉగాది పండుగ సందర్భంగా తెలుగు సంవత్సరాది నూతన శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని మాజీ ఎంపి రాష్ట్ర బి.ఆర్.ఎస్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. పంచాంగ కర్త శ్రీ ఓరుగంటి.మనోహర్ శర్మ,వారి కుమారుడు నాగారాజు శర్మ గార్లను రావుల.చంద్రశేఖర్ రెడ్డి సన్మానించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా రావుల చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఓరుగంటి.మనోహర్ శర్మ మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందిస్తున్నారని కొనియాడారు. ఇటీవల అయ్యప్పస్వామి నూతన అధ్యక్షునిగా ముత్తుకృష్ణ గురుస్వామి ని రావుల చంద్రశేఖరరెడ్డి సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ నందిమల్ల.అశోక్, ఉంగ్లం. తిరుమల్,బండారు.కృష్ణ, బీచు పల్లి యాదవ్,ప్రేమ్ నాథ్ రెడ్డి, నందిమల్ల.రమేష్,ఎం.డి.గౌస్,డాక్టర్. డ్యానియాల్,ముద్దుసర్,తోట.శ్రీను తదితరులు పాల్గొన్నారు. (Story : నూతన పంచాంగాన్ని ఆవిష్కరించిన రావుల)