అగ్ని ప్రమాద బాధితులకు చేయూతనిచ్చిన జీవీ
బాధిత కుటుంబాలకు శివశక్తి ఫౌండేషన్ ఆర్థిక సాయం
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ 1వ వార్డు పరిధిలోని వెన్నపూస కాలనీలో ఈ నెల 25న జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబాలకు శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ అండగా నిలిచింది. బాధిత కుటుంబాలకు రూ.3 వేల చొప్పున నగదు సాయం, వంట సామగ్రి, నిత్యావసర సరుకులు, బియ్యం అందజేశారు. వినుకొండలోని కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావు అగ్నిప్రమాద బాధితులు తిరుమల శ్రీను, తిరుమల రమణయ్య, తిరుమల గోవింద్ కు సాయం అందజేశారు. స్థానిక నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ తరఫున ఆర్థిక సాయం అందించారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన జీవీ ఆంజనేయులుకు బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ మేనేజర్ రమేష్, పీవీ సురేష్, మురళీకృష్ణ, వడితె శ్రీను నాయక్, పొన్నూరు చిన్నా, షేక్ ఖాసిం, గంధం సుబ్బారావు, తిరుమల రాజు పాల్గొన్నారు . (Story : అగ్ని ప్రమాద బాధితులకు చేయూతనిచ్చిన జీవీ )