మంచినీటి పైపుల పేరుతో రోడ్లన్నీ ధ్వంసం
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి పలు కాలనీలలో, కాసుల కోసం, మంచినీటి పైపుల పేరుతో మున్సిపాలిటీ కాంట్రాక్టర్లు రోడ్లన్నీ ధ్వంసం చేశారుఅని పర్యవేక్షణ లేని అధికారులు, ప్రజా ప్రతినిధులు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేని అధికారులను తొలగించాలని వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక కోరారు. 18 కాలనీలలో పలు అభివృద్ధి పనులు పేరిట రోడ్లన్నీ ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ, ధ్వంసం చేసిన రోడ్లను మళ్లీ వేయకపోవడం ప్రశ్నిస్తూ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మంచినీటి పైపుల పేరుతో కాంట్రాక్టర్ విచ్చలవిడిగా రోడ్లన్నీ ధ్వంసం చేశారని, వాటిని పూర్తి చేయకుండా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని వారిపై పర్యవేక్షణ లేని మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, పైపులైన్ కోసం తవ్విన గుంతలో పడిన గంధం సంతోషమ్మ కాలు విరిగిందని ఆమెకు తగిన పరిహారం చెల్లించాలని, ఐదో వార్డులో ఇంటి ముందు కాలువలు లేక కాలువ ముందుకు పోవడానికి స్థలం లేక ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారని ఐదు సంవత్సరాల నుండి అందరి నాయకులు వెంబడి తిరిగిన ప్రజలు వేసారి పోతున్నారని వెంటనే ఈ సమస్యలను పరిష్కరించకుంటే మున్సిపాలిటీ, కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్ తో పాటు వెంకటేశ్వర్లు, గౌనికాడి యాదయ్య, గంధం భరత్ కుమార్, కొత్త గొల్ల శంకర్, గంధం కొండన్న, గంధం హనుమంతు, సుందర్ రాజ్, నరసింహ, శివన్న, కురుమూర్తి, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. (Story : మంచినీటి పైపుల పేరుతో రోడ్లన్నీ ధ్వంసం)