Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌  వెన్నపూస కాలనీలో  అగ్ని ప్రమాదం

 వెన్నపూస కాలనీలో  అగ్ని ప్రమాదం

0

 వెన్నపూస కాలనీలో  అగ్ని ప్రమాదం

మూడు ఇళ్ళు దగ్ధం
కాలిపోయిన ఇళ్లను పరిశీలించిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నేతలు
ప్రమాదవశాత్తు కాలిపోయిన కుటుంబాల వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి
మారుతి వరప్రసాద్ సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి
బూదాల శ్రీనివాసరావు  సిపిఐ వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి

న్యూస్ తెలుగు / వినుకొండ : వెన్నపూస కాలనీలో గృహాలు తగలబడిన వారికి వెంటనే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి గృహాలు నిర్మించుకొనుటకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి తగు చర్యలు చేపట్టాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్, సిపిఐ నాయకులు బూదాల శ్రీనివాసరావు లు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం నాడు వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణంలోని ఒకటవ వార్డు వెన్నపూస కాలనీలో నివసిస్తున్న ప్రజలు కడుపేదవారిగా ఉండి ప్రతిరోజు కూలికి వెళితే గాని జరగని కుటుంబాల వారు ప్రొద్దున్నే లేచి కూలి పనికి వెళ్ళినారు. ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో తిరుమల రమణ, తిరుమల మార్కు, తిరుమల స్టీవెన్ అను వారి మూడు గృహములు పూర్తిగా తగలబడిపోయినవి. ఆ ఇళ్లలో కట్టు బట్టలతో సహా వంట సామాను ఇంటి సామాను ఒక లక్ష రూపాయలు డబ్బులు కాలిపోయిన గ్యాస్ సిలిండర్ పూర్తిగా మూడు ఇళ్లలో అన్ని సామాన్లు తగలబడిపోయినవి. బాధితులు చెట్ల కింద కూర్చొని రోదిస్తున్న సమయంలో సిపిఐ నాయకులకు తెలిసిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి ఆ మూడు కుటుంబాల వారికి బట్టలు చీరలు బియ్యము సరుకులు కూరగాయలు సహాయముగా అందించి వారిని ఓదార్చడం జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తామని, స్థానిక శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి ప్రభుత్వ సహాయాన్ని అందించి బాధితులకు గృహములు నిర్మించుకొనుటకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని అందించవలసిందిగా ప్రభుత్వానికి తెలియజేస్తామని బాధితులకు తెలిపినారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు మాజీ వైస్ చైర్మన్ సండ్రపాటి సైదా, రాయబారం వందనం, ఎ. పవన్ కుమార్, పిన్ని బోయిన వెంకటేశ్వర్లు, షేక్ మస్తాన్, కే మల్లికార్జున, జల్లి వెంకటేశ్వర్లు, సోడాల సాంబయ్య నల్ల పోతుల శ్రీను బాధితులు తదితరులు పాల్గొన్నారు. (Story :  వెన్నపూస కాలనీలో  అగ్ని ప్రమాదం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version