పెబ్బేరు ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
న్యూస్ తెలుగు/వనపర్తి : మతసామరస్యానికి పండుగలు ప్రతీకలుగా మిగులుతాయని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తరఫున పెబ్బేరు మండల కేంద్రంలోని మసీదులో, ప్రభుత్వం తరఫున సహారా ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే పండ్లను తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు హిందూ ముస్లిం తేడా లేకుండా ఇలాంటి పండుగలు కలిసి జరుపుకోవడం ఐక్యతకు నాందిగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.(Story : పెబ్బేరు ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి )