వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముఖి సూర్యనారాయణ
న్యూస్ తెలుగు/ సాలూరు : సాలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముఖి సూర్యనారాయణ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 47 మార్కెట్ కమిటీల చైర్మన్లను
నియమించడంలో భాగంగా సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ నియమించారు.సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముఖి సూర్యనారాయణను మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించడం పట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలియజేశారు.(Story : వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముఖి సూర్యనారాయణ )