అంగన్వాడీ ఉద్యోగాల భర్తీపై
మంత్రి కీలక నిర్ణయం
న్యూస్ తెలుగు /సాలూరు : అంగన్వాడీ ఉద్యోగాల భర్తీపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కీలక నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ హెల్పర్లు మరియు అంగన్వాడీ వర్కర్లు కలిపి 948 పోస్టులను విడుదల చేయాలని 26 జిల్లాల అధికారులకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. శుక్రవారం అమరావతి సచివాలయం నుండి ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ సేవలను మరింత బలోపేతం చేయడంతో పాటు, మహిళలకు ఉపాధి అవకాశాలను పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె తెలిపారు. పిల్లల పోషణ, ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో 2025-26 బడ్జెట్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీలు మరియు డైరెక్టర్లు పాల్గొన్నారు. మహిళలు, పిల్లల అభివృద్ధి కార్యక్రమాల కోసం బడ్జెట్ కేటాయింపులను సమీక్షించారు. మహిళా సాధికారత కోసం అమలులో ఉన్న పథకాలను సమీక్షించారు. పిల్లల రక్షణ, పోషకాహారం, సంక్షేమ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
నిధుల సమర్థవంతమైన వినియోగం మరియు ప్రభావవంతమైన సంక్షేమ విధానాల అమలుకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. (Story : అంగన్వాడీ ఉద్యోగాల భర్తీపై మంత్రి కీలక నిర్ణయం)