నిషేధిత ప్రతి విత్తనాలు విక్రయిస్తే కటిన చర్యలు
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ లోని విత్తన షాపులను గురువారం కమిషనర్ కార్యాలయం సహాయ వ్యవసాయ పంచాలకులు ఆర్.శశిధర్ రెడ్డి మరియు ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ వ్యవసాయ అధికారి సురేష్ వినుకొండ మండల వ్యవసాయ అధికారి జి.వరలక్ష్మి విత్తన షాపులను తనిఖీ చేసి హెచ్టి (హెచ్. టి)టెస్టులను నిర్వహించారు. విత్తనాల షాపులు విత్తనం నిల్వలు వచ్చిన వెంటనే మండల వ్యవసాయ అధికారికి తెలియచేయాలని, రైతులకు బిల్లుతో మాత్రమే విత్తనాలు విక్రయించాలని, బిల్లులో లాటు నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపారు. రైతులు తాము కొనుగోలు చేస్తున్న విత్తనాలు బిల్లును, ఖాళీ సంచిని పంట కాలం పూర్తయ్యే వరకు దాచుకోవాలని అన్నారు.(Story : నిషేధిత ప్రతి విత్తనాలు విక్రయిస్తే కటిన చర్యలు )