అధికారం లో లేకపోయినా ప్రజల గుండెల్లో స్థానం
విజయ రాములు
న్యూస్‌తెలుగు/వనపర్తి: సిపిఐ దేశంలో, రాష్ట్రంలో అధికారంలో లేకున్నా ప్రజల గుండెల్లో స్థానం ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయ రాములు అన్నారు. శుక్రవారం వనపర్తి సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో పార్టీ ఆవిర్భవించి డిసెంబర్ 26, 2024 నాటికి 100వ సంవత్సరంలోకి అడిగి పెట్టిందన్నారు. దేశంలో ఉండేళ్ల చరిత్ర గల ఏకైక పార్టీ సిపిఐ మాత్రమే అన్నారు. స్వాతంత్రం కోసం, తెలంగాణ ప్రజలను నిజాం నుంచి విముక్తి కోసం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిందన్నారు. కార్మిక కర్షక పీడిత తాడిత ప్రజల గొంతుకగా చట్టసభల్లో బయట పోరాడుతుందన్నారు. పోరాటాల ఫలితంగా దేశంలో పేదలకు ప్రభుత్వ భూమి పంపిణీ, నివేశన స్థలాలు, రైతులకు రుణమాఫీ, పింఛన్లు, తదితర ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలవుతున్నాయన్నారు. సిపిఐ బలపడితేనే పేదలకు భవిష్యత్తు ఉంటుందన్నారు. పట్టణం గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శతజయంతి ఉత్సవాల సందర్భంగా వందేళ్ళ పోరాట చరిత్రను స్మరించుకొని, భవిష్యత్తు పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరుగుతుందన్నారు. శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీలో సిపిఐ పక్ష నేత కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల నరసింహ హాజరవుతున్నారు. జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు జిల్లా కార్మిక సభ్యులు కళావతమ్మ , శ్రీరామ్,రమేష్, గోపాలకృష్ణ, నేతలు పృథ్వినాదం, వంశీ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. (Story : అధికారం లో లేకపోయినా ప్రజల గుండెల్లో స్థానం)