వీధి కుక్కల బారి నుండి చిన్నపిల్లలను ప్రజలను కాపాడండి
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి లో వీధి వీధికి 30 నుండి 50 వరకు కుక్కలు సంచరిస్తూ చిన్న పిల్లల వెంట పడుతూ వారిని కరుస్తున్నాయని, పాదాచారులు అయిన మహిళలపై టూ వీలర్స్ పై వెళ్లే పురుషులపై దాడి చేస్తున్నాయని, వీధి కుక్కలు ఎక్కువైనా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, కుంటి సాకులు చెప్పుతూ అధికారులు కాలం వెళ్లిపుచ్చుతున్నారనీ. అలాగే కోతులు వందలుగా, మందలుగా తిరుగుతూ ఇంట్లోకి వచ్చి మహిళలపై దాడి చేస్తున్నాయని, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కమీషనర్ ను, సానిటరీ ఇన్స్పెక్టర్ ను ఐక్యవేదిక ప్రశ్నించారు. గతంలో యాంటీ బర్త్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి కుక్కలను అక్కడికి తరలించే వారినీ , దానికై మున్సిపాలిటీ నుండి కోటి రూపాయల నిధులు కేటాయించారని అది వృధాగా ఉందని కనుక వెంటనే దాన్ని వినియోగంలోకి తెచ్చి కుక్కల్ని పట్టి సంరక్షించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు, కాంగ్రెస్ నాయకుడు వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్, బీసీ సంఘం నాయకులు గౌనికడి యాదయ్య, బీ.ఎస్.పి టౌన్ ప్రెసిడెంట్ గంధం భరత్, శివకుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.(Story : వీధి కుక్కల బారి నుండి చిన్నపిల్లలను ప్రజలను కాపాడండి )