మీ సేవలు విజయోత్సవ ర్యాలీ
న్యూస్ తెలుగు/ వినుకొండ : వినుకొండ నియోజకవర్గం మీ సేవలకు పూర్వ వైభవం తీసుకువచ్చిన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నారా లోకేష్, జీవీ ఆంజనేయులు ధన్యవాదాలు తెలుపుతూ వినుకొండ పట్టణంలోని మీసేవ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం పట్టణ పురవీధుల నందు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం కొత్తపేట నందు గల మీసేవ కార్యాలయం నందు నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం అధ్యక్షులు వల్లం శెట్టి విశ్వనాధ్ మాట్లాడుతూ. గత పది సంవత్సరాలుగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యాని గురైన మీ సేవలను నేటి ప్రభుత్వం ఇవ గళం యాత్రలో ఐటీ మంత్రి లోకేష్ బాబు ఇచ్చిన హామీకి కట్టుబడి ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేశారు. మేమెంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మనసా వాచా కర్మణా రుణపడి ఉంటామని అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఐదు మండలాలకు చెందిన మీసేవ నిర్వాహకులు శివకృష్ణ, మహేష్, సూరి, మణికంఠ, వెంకటరెడ్డి, నారాయణ, వల్లం శెట్టి విశ్వనాథ్ ,అంజి, రవి, మేడం మణికంఠ, చంద్రశేఖర్, సత్యనారాయణ, కిషోర్, తిరుపతయ్య, అంజి, తదితరులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. (Story : మీ సేవలు విజయోత్సవ ర్యాలీ)