ఏబిసిడి వర్గీకరణ పై మాట మారుస్తున్న పెద్దలు
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక మాల మహానాడు రాష్ట్ర కార్యాలయం నందు బుధవారం విలేకర్ల సమావేశం జరిగింది. ఏబీసీడీ వర్గీకరణ పై గత 20 సంవత్సరాల నుండి మాల, మాదిగల మధ్య జరుగుతున్న క్యాటగిరి రిజర్వేషన్ పై మంగళవారం అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వర్గీకరణ అంశంపై మాట్లాడటం జరిగింది. ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ముతోటి పౌలు మాట్లాడుతూ. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ వర్గీకరణ అంశంపై పెద్దన్న పాత్ర పోషించాలి అని, ఈ ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధిక మెజార్టీ కలిగిన మాలలు కోటి మంది ఉన్నారు. వారిలో ఎస్సీలు లో ఉండబడిన మాదిగలు 40 లక్షల జనాభా మాత్రమే ఉన్నారు. అందులో భాగంగా మాదిగలకు 5% శాతం రిజర్వేషన్ అని చెప్పడం జరిగింది. మాలలకు 6% శాతం రిజర్వేషన్ అని చెప్పడం జరిగింది. దీనిని వ్యతిరేకిస్తూ మాలలకి 9% శాతం రిజర్వేషన్ ఇవ్వాలని, మాదిగలకు 5% శాతం రిజర్వేషన్ ఇవ్వాలని, రెల్లి వారికి 1% శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మొత్తం కలిపి ఈ ఆంధ్రప్రదేశ్ లో 15% రిజర్వేషన్ ఇచ్చేంతవరకు పోరాటం చేస్తామని,అలాగే ఇప్పుడున్న జనాభా ప్రాతిపదిక కింద జనాభా లెక్కలు తేల్చాలని, దీనికి ఇన్చార్జిలుగా కలెక్టర్స్ ని వేయాలని, ఖచ్చితమైన కుల గణన చేయాలని, మీరు 2011 జనాభా లెక్కల ప్రకారం మీరు చెబుతున్న లెక్కలు తప్పు అని,దీన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు ఉన్న 2024 జనాభా లెక్కల ప్రకారం తెలిస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కోటి మంది మాలలో 40 లక్షల మంది మాదిగలు ఉన్నారని, ఈ లెక్కలను తేల్చమని ఏబీసీడీ వర్గీకరణ అంశంపై అప్పుడు మాట్లాడాలి అని ఈ ప్రెస్ మీట్ ద్వారా గవర్నమెంట్ కి డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా అధ్యక్షుడు మైనర్ బాబు వినుకొండ నియోజకవర్గం అధ్యక్షులు కొట్టెల కమలాకర్, నియోజకవర్గ యూత్ ప్రెసిడెం.(Story : ఏబిసిడి వర్గీకరణ పై మాట మారుస్తున్న పెద్దలు )