Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ గిరిజనులకు రక్షణ కల్పించాలి

గిరిజనులకు రక్షణ కల్పించాలి

0

గిరిజనులకు రక్షణ కల్పించాలి

న్యూస్ తెలుగు /సాలూరు : గిరిజనులపై దాడి చేసి గాయపరిచి కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని గిరిజనులకు పీపీపీ రక్షణ కల్పించాలని
ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షులు వంతల సుందర్ రావు ఆదివాసి గిరిజన సంఘాలు జేఏసీ నాయకులు కొండ గొర్రె ఉదయ్ కుమార్, పుష్పారావు, గిరి, డిమాండ్ చేశారు. మంగళవారం బాధిత కుటుంబంతో సాలూరు తాసిల్దార్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ
సాలూరు మండలం తోణం పంచాయతీ మద్దిని వలస గ్రామకి గ్రామానికి చెందిన కూనేటి లక్ష్మణరావు వారి కుటుంబ సభ్యుల పైన అదే గ్రామానికి చెందిన వీరమల్లు నాగేశ్వరరావు మోహన్ రావు, ఓరుగంటి మస్తాన్రావు, కొండలరావు, సిహెచ్ శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యులతో కలిపి చిన్నపిల్లలు ఆడవాళ్లు అని తేడా లేకుండా దాడి చేయడం గాయపరచడం కులం పేరుతో దూషించడం బెదిరించడం సరికాదని తెలిపారు, దాడి చేసి గాయపరిచి కులం పేరుతో దూషించిన వారందరి పై సమగ్ర దర్యాప్తు చేసి
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు, గిరిజన కుటుంబానికి రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరారు, లేనియెడల ఆందోళన పోరాటాలకు సిద్ధమవుతామని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘాల జేఏసీ నాయకులు జై సింహా గెమ్మెల బాబయ్య ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తాడంగి గాసి తదితరులు పాల్గొన్నారు, (Story : గిరిజనులకు రక్షణ కల్పించాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version