రాజ్యాంగ పదవిని ప్రభావితం చేయడం కాంగ్రెస్ పార్టీకే చెల్లింది
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రజాస్వామ్యంలో ప్రజల తరుపున ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ఏకపక్షంగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యములో అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వ ఒంటికాలు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,పి.రమేష్ గౌడ్, నందిమల్ల.అశోక్ మాట్లాడుతూ పంటలు ఎండిపోతున్నాయి పాలన పక్కదారి పడుతుంది సమయం ఇవ్వాలని కోరితే సస్పెండ్ చేయడాన్ని నిరసించారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలు రైతు భరోసా, రైతు భీమా,రైతు రుణ మాఫీ,మహిళకు 2500,నిరుద్యోగ భృతి,కె.సి.ఆర్ కిట్టు,కళ్యాణ లక్ష్మి తోలం బంగారం తదితర అంశాలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే తట్టుకోలేక అన్ పార్లమెంటరీ వార్డ్స్ మాట్లాడారని,దళిత స్పీకర్ గారిని అవమాన పరిచారని ఆరోపిస్తూ అసెంబ్లీ వాయిదా వేసి కుట్ర పూర్తిగా సస్పెండ్ చేయాడాని తీవ్రంగా ఖండించారు. వెంటనే బేషరతుగా సస్పెండ్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్స్ బండారు కృష్ణ,నాగన్న యాదవ్, ఉంగ్లమ్. తిరుమల్,ప్రేమ్ నాథ్ రెడ్డి, డాక్టర్.డ్యానియల్,స్టార్.రహీమ్,జానంపేట్.శ్రీనివాసులు, జోహేబ్ హుస్సేన్,ఫజల్, ఏ.కె.పాషా, అలీం,ఎం.వెంకటయ్య,మూణికుమార్,లక్ష్మణ్ శివ, భరత్,ఇంతియాజ్,తోట.శ్రీనివాసులు,తదితరులు పాల్గొన్నారు. (Story : రాజ్యాంగ పదవిని ప్రభావితం చేయడం కాంగ్రెస్ పార్టీకే చెల్లింది)