అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి
ఏఐటీయూసీ
న్యూస్ తెలుగు /వినుకొండ : గ్రాడ్యుయేట్ అమలు చేయాలని మినీ సెంటర్లో మెయిన్ సెంట్రల్ గా మారుస్తూ జీవో ఇవ్వాలని కోరుతూ సోమవారం వినుకొండ తాసిల్దార్ ఆఫీస్ లో అంగన్వాడి వర్కర్స్ ఆధ్వర్యంలో తాసిల్దార్ సురేష్ నాయక్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్ సీనియర్ నాయకురాలు ఎస్. ప్రసన్నాంబ మాట్లాడుతూ. మన రాష్ట్రంలో పేద గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్స్ అనేక సేవలు అందిస్తున్నారు. అంగనవాడి సెంటర్ల నిర్వహణకు రకరకాల పెట్టుబడులు పెట్టి సెంటర్లో నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదని ఆమె అన్నారు. అంగన్వాడీలకి వేతనాల పెంపు తదితర సమస్యల పరిష్కారం కొరకు గతంలో 42 రోజులపాటు చారిత్రాత్మక సమ్మె నిర్వహించాము. సమ్మె ముగింపు సందర్భంగా అంగన్వాడీలకు 2024 జులైలో వేతనాలు పెంపు ఇతర సమస్యల పరిష్కారం చేస్తానని మినిట్స్ ఇచ్చారు. 20 వేల రూపాయలు మినిట్స్ లో ఉంటే మట్టి ఖర్చులు కేవలం 15 వేల రూపాయలు ఇచ్చారు. నేటి వరకు మినీల జీవో ఇవ్వలేదు. మిగిలిన సమస్యల పరిష్కారం కాలేదు. కావున బడ్జెట్ సమావేశాలు సందర్భంగా కూటమి ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని ప్రసున్నాంబ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ షకీల, షేక్ మున్నీ, ఉమా శంకరి ,ఎన్. నీరజ, కే. పద్మ, ఎస్.కే. నీలిమ, ఏఐటీయూసీ నాయకులు బూదాల శ్రీనివాసరావు, కొండ్రపుట్ల సుభాని, రాయబారం వందనం, పిన్నబోయిన వెంకటేశ్వర్లు, కొప్పరపు మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు. (Story : అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి) అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి