వాలంటీరీల సమస్యలు పరిష్కరించాలి
ఈనెల 17న చలో విజయవాడ కార్యక్రమానికి జయప్రదం చేయాలి సీఐటీయూ
న్యూస్ తెలుగు /చింతూరు : వాలంటీర్లు సమస్యల పరిష్కరించాలని ముఖ్యనాయకులు సమావేశం చింతూరు మండల వాలంటీర్లు యూనియన్ మండలం కార్యదర్శి కలుములు మహేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రంపచోడవరం జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ గ్రామ వార్డు వాలంటీర్లు యూనియన్ సిఐటియూ అనుబంధ సంఘం పిలుపుమేరకు ఈ నెల 17న చలో విజయవాడ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెండున్నర లక్షలు వాలంటీర్లు అందరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి అయీ ఈ కార్యక్రమానికి జయప్రదం చేయాలని అన్నారు. ఇదే కూటమి ముఖ్యమంత్రి ఆరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల సభల సందర్భంగా వాలంటరీ వ్యవస్థని వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్లతో వెట్టి చాకిరి చేయిస్తుంది.అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాను అలానే వాలంటరీలకు గౌరవ వేతనం పదివేల రూపాయలు అందిస్తానన్నారు. వాలంటీర్లు కు ఉద్యోగ భద్రత కల్పించాలి. బకాయి వేతనాలు చెల్లించాలి. బలవంతపు రాజీనామా చేయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, అలానే బలవంతపు రాజీనామా చేసిన వాలంటరీని కూడా వీధుల్లోకి తీసుకోవాలని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే. ప్రతి ఒక్క కార్మికులకి న్యాయం చేస్తామన్నారు దాదాపు 7 నెలలు కావస్తున్న కూడా ఏ సమస్య కూడా పరిష్కరించే దాంట్లో దృష్టి పెట్టలేదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రాబట్టి వాలంటరీలు దాదాపు రెండున్నర లక్షలు కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. వాలంటరీ సమస్యలు పరిష్కరించకపోతే మరి ఆనీ ఉద్యమాలు చేయడానికి కూడా వాలంటీర్లు వెనకడుగు వెయ్యాలని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎటపాక మండల కార్యదర్శి భూక్య కుమార్. నాయకులు గడ్డల వనరాజ్. సాదుల రామిరెడ్డి.రాజు. లక్ష్మణ్. తదితరులు పాల్గొన్నారు. (Story : వాలంటీరీల సమస్యలు పరిష్కరించాలి )