వనపర్తిలో శతాబ్ది ఉత్సవాలకు సిద్ధం కావాలి
విజయ రాములు
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు మార్చి 23న జరగనున్నాయని పార్టీ క్యాడర్లు సిద్ధం కావాలని జిల్లా కార్యదర్శి విజయరాములు పిలుపునిచ్చారు. సోమవారం సిపిఐ కార్యాలయంలో కే శ్రీరామ్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సిపిఐ 1925 డిసెంబర్ 25న కాన్పూర్లో ఆవిర్భవించిందని 19 24 డిసెంబర్ 25 నాటికి వందేళ్లలోకి అడుగుపెట్టిందన్నారు. 1926 డిసెంబర్ 25 వరకు ఏడాది పాటు శతాబ్ది ఉత్సవాలను జరిపేందుకు నిర్ణయించిందన్నారు. అందులో భాగంగా మార్చి 23న వనపర్తి దాచా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో బహిరంగ సభ అంతకుముందు పట్టణంలో ర్యాలీ జరుగుతుందనిముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ పక్ష కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొంటారన్నారు. గ్రామ మండల జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించాలన్నారు. వందేళ్ళ పోరాట చరిత్రను పార్టీ కార్యకర్తలకు వివరించి సభకు తరలి వచ్చేందుకు సిద్ధం చేయాలన్నారు. స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కారానికి పోరాట కార్యక్రమం రూపొందించాలన్నారు. గతంతో పోలిస్తే సభ్యత్వం పెరిగిందన్నారు.
ఎమ్మెల్సీ సీటు తో సిపిఐ బలం బాధ్యత పెరిగింది.
అసెంబ్లీ ఎన్నికల ఒప్పందంలో భాగంగా సిపిఐ కి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీటును కేటాయించడంతో చట్టసభల్లో మన బలం, బాధ్యత పెరిగిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక్కరు ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ లో అన్ని వర్గాల ప్రజల గొంతును అసెంబ్లీలో గెలిపిస్తూ సమర్థవంతమైన పాత్ర పోషిస్తున్నారు అన్నారు. ఎమ్మెల్సీ సీటు కేటాయించడం కూనమనేనికి తోడు ఎమ్మెల్సీ కూడా తోడైతే చట్టసభల్లో రెట్టింపు బలం పెరుగుతుందని, ప్రజా సమస్యలపై పోరాటానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఒప్పందం మేరకు సిపిఐ కి ఒక ఎమ్మెల్సీ సీటు కాంగ్రెస్ కేటాయించటం హర్షనీయమన్నారు. హామీ మేరకు మరో ఎమ్మెల్సీ సీట్లు కూడా ఇవ్వాలన్నారు. ఎమ్మెల్సీ సీటుకు బలహీన వర్గాల నేత నెల్లికంటి సత్యం ను ఎంపిక చేయటం సంతోషకరమన్నారు. నెల్లికంటి సత్యం కు సిపిఐ జిల్లా కమిటీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసింది. జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, శ్రీరామ్, జె. చంద్రయ్య, రమేష్, భాస్కర్, రాబర్ట్, మోష, అబ్రహం, నరసింహయ్య శెట్టి, శ్రీహరి, డంగు కుర్మయ్య, మశప్ప తదితరులు పాల్గొన్నారు.(Story : వనపర్తిలో శతాబ్ది ఉత్సవాలకు సిద్ధం కావాలి)