Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌నారాయణ స్కూల్ నందు ప్రీ ప్రైమరీ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్

నారాయణ స్కూల్ నందు ప్రీ ప్రైమరీ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్

నారాయణ స్కూల్ నందు ప్రీ ప్రైమరీ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్

న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక నారాయణ స్కూల్ నందు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ. ప్రీ ప్రైమరీ స్థాయి నుంచే పిల్లలకి యాక్టివిటీ బేస్ లర్నింగ్ ద్వారా పాఠ్యాంశాలు చెప్పడం ద్వారా పిల్లలు చురుకుగా ఉండడమే కాకుండా సబ్జెక్ట్స్ సులభంగా నేర్చుకొని చెప్పగలుగుతారు. ఈ కార్యక్రమంలో సంవత్సరం పొడవును విద్యార్థుల పాఠ్యాంశాలలో నేర్చుకున్న అంశాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యార్థి పురోగతి సాధనలను తల్లిదండ్రుల ఎదుట ప్రదర్శించడమే ఈ కార్యక్రమం ముఖ్యం ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఆర్.జి.ఎం. శ్రీనివాసులు రెడ్డి , ఏ.జీ.ఎం.లక్ష్మణ్ రెడ్డి , కోఆర్డినేటర్ రిహాని, ఇంచార్జ్ అనురాధ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాస్, పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. (Story : నారాయణ స్కూల్ నందు ప్రీ ప్రైమరీ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!