బొంత రాజీవ్ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ వాసి బొంత రాజీవ్ కు ఊటీలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో సోషల్ సర్వీస్ క్యాటగిరీలో గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు. రాజీవ్ వినుకొండ లయోలా లో చదువుకొని గత 11 సంవత్సరాలుగా హైదరాబాద్ లోని హయత్ నగర్ లో “”ద సుధీర్ ఫౌండేషన్”” స్థాపించి 125 మంది అనాధ మరియు పేద విద్యార్థులకు నర్సరీ నుండి ఇంటర్మీడియట్ వరకు సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సేవ నిర్వహిస్తున్న బొంత రాజీవ్ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం జరిగింది. రాజీవ్ తండ్రి బొంత కొర్నేలు వినుకొండ ఫారెస్ట్ గార్డు రిటైర్డ్
అయ్యారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలు స్వచ్ఛంద సంస్థలు”” ద సుధీర్ ఫౌండేషన్”” కు ప్రజా ప్రతినిధులు, మేధావులు శుభాకాంక్షలు తెలుపుతూ మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. (sTORY : బొంత రాజీవ్ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం)