మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ వనపర్తి జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , సింగిరెడ్డి వాసంతి అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని మహిళలకు పూర్తి సమానత్వం స్వేచ్ఛ హక్కులు ఉండాలని రాజకీయ రంగంలో కూడా మహిళలు అత్యున్నత స్థాయికి ఎదగాలని అన్నారు, ఈ సందర్భంగా వనపర్తి నియోజకవర్గం లోని సీనియర్ సిటిజన్ మహిళలకు ఘనంగా సన్మానం చేశారు బిఆర్ఎస్ పార్టీ పెబ్బేరు పట్టణ అధ్యక్షుడు వి దిలీప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పెబ్బేరు పట్టణానికి చెందిన గోనెల పార్వతమ్మ, వల్లపు రెడ్డి కమలమ్మ,గోనెల బుచ్చమ్మ, రామేశ్వరమ్మ, చంద్రమలను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రే స్వామి,మాజీ కౌన్సిలర్ చిన్న ఎల్లారెడ్డి, గోనెల సహదేవుడు, పాల్గొన్నారు. (Story : మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలి)