Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌మహిళల రక్షణకు ప్రభుత్వాలు కృషి చేయాలి

మహిళల రక్షణకు ప్రభుత్వాలు కృషి చేయాలి

మహిళల రక్షణకు ప్రభుత్వాలు కృషి చేయాలి

న్యూస్ తెలుగు /సాలూరు : సహనానికి ఓర్పుకి ప్రతిరూపం మహిళని వారి భద్రత, రక్షణకు ప్రభుత్వాలు కృషి చేయాలని మోప్మా పి ఎం ఎం పుష్పలత అన్నారు. గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల లో భాగంగా సాలూరు పట్టణంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆద్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ మున్సిపల్ ఆఫీసు నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో సాలూరు మహిళా సంఘ సభ్యులు, పురపాలక శాఖ సిబ్బంది , మెప్మా సిబ్బంది, ఆర్ పి లు, సి.ఓ లు, సి.యం.యం. , డి.ఇ ఓ సిబ్బంది మరియు నీడ్ స్వచ్ఛంద సంస్థ వేణు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ .సహనానికి ప్రతిరూపం మహిళా అని, మహిళా దినోత్సవం స్పూర్తిని ప్రతి రోజు కొనసాగించాలని అన్నారు.మహిళల భద్రత, రక్షణ, సమానత్వం, అభివృద్ధి, సాధికారతను కృషి చెయ్యాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. (Story : మహిళల రక్షణకు ప్రభుత్వాలు కృషి చేయాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!