కల్చరల్ ఫెస్ట్ వేడుకలు
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక గీతాంజలి రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు నెక్స్ట్ జెన్ కిడ్స్ వారి కల్చరల్ ఫెస్ట్ 2కే 25 వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో చిన్నారులు సందడి చేశారు. గీతాంజలి స్కూల్స్ వ్యవస్థాపకులైన ఎండ్లూరి శేషగిరిరావు ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. చిన్నారులు విద్యతోపాటు పలు రంగాలలో రాణించాలని అప్పుడే సంపూర్ణమైనటువంటి విద్యార్థిగా నిలబడతాడని పిలుపునిచ్చారు. చదువుతోపాటు శారీరక దృఢత్వం కలిగించే ఆటలను తప్పక ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అలాగే చిన్నారులు ఆటపాటలతో తమ పైన ఉన్న ఒత్తిడిని తొలగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఈ విద్యా సంవత్సరంలో మంచి ప్రోగ్రెస్ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ టి కృష్ణవేణి, కరస్పాండెంట్ వై కిషోర్, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. (Story : కల్చరల్ ఫెస్ట్ వేడుకలు)