క్రీడల్లో ప్రతిభ చూపుతున్న వెంకటేశ్వరి
న్యూస్ తెలుగు /ఈపూరు: క్రీడారంగంలో యువత ప్రతిభచూపుతూ, జీవితంలో క్రీడా స్ఫూర్తిని చాటాలని ధనలక్ష్మి వ్యాయామ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చుండు వెంకటరావు అన్నారు. మండలంలోని ధనలక్ష్మి వ్యాయామ కళాశాల నందు బిపిఈడి ద్వితీయ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని కే వెంకటేశ్వరి ఈనెల 3 మరియు నాలుగవ తేదీలలో ఎంఏఎం ఫార్మసీ కళాశాలల ఆధ్వర్యంలో జరిగిన అంతర్ కళాశాలల మహిళల బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొని యూనివర్సిటీ జట్టు ఎంపికై తమిళనాడు రాష్ట్రంలోని అలగప్ప యూనివర్సిటీలో మార్చి 29 నుండి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరిగే అంతర్ విశ్వవిద్యాలయ పోటీలకు నాగార్జున యూనివర్సిటీ జట్టుకు ప్రాతినిధ్యం వహించునున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చుండు వెంకటరావు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు చాలా ముఖ్యమని, క్రీడల మనిషికి శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం, ఒత్తిడి తట్టుకునేలా సహకరిస్తాయన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన తమ కళాశాల విద్యార్థిని కే వెంకటేశ్వరిని కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ మేదరమెట్ల రామ శేషగిరిరావు అధ్యాపకులు ఆర్ బలరాం నాయక్ సిహెచ్ అరవింద్ ఎం దాసు కే వంశీ చైతన్య తదితరులు అభినందించారు. (Story : క్రీడల్లో ప్రతిభ చూపుతున్న వెంకటేశ్వరి)