కూటమిపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకం
ఆలపాటి రాజాకు శుభాకాంక్షలు తెలిపిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు / వినుకొండ : రాష్ట్రంలో తమ ప్రభుత్వంపై ఆదరణ, నమ్మకాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి అనడానికి పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి సాధించిన ఓట్ల సునామీయే నిదర్శనమని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన 9నెలల్లో ఇచ్చిన హామీల అమలు, రెట్టింపు అయిన సంక్షేమం, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో లభించిన భరోసా, పోలవరం, అమరావతి మొదలు రోడ్ల మరమ్మతుల రూపంలో ఊరూరా కనిపిస్తోన్న మార్పులే ప్రజల్లో విశ్వాసం, ఇంతటి ఘన విజయానికి కారణంగా పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణా-గుంటూరుల జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరఫున భారీ విజయం సాధించిన ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను కలసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కొండనల్లి శ్రీనివాస్, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, నెట్టెం రఘురాం, తదితరులు ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 82వేలకు పైగా ఓట్లు ఆధిక్యం సాధించిన నేపథ్యంలో ఆలపాటిని ప్రత్యేకంగా అభినందించారు జీవీ ఆంజనేయులు. సరిగ్గా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే ఏపీపీఎస్సీ పరీక్షల అర్హ త వయస్సును 42ఏళ్లకు పెంచడం ద్వారా లక్షలాదిమంది నిరుద్యోగులకు, వయోపరిమితి దాటి పోతున్న వారికి ప్రభుత్వం మేలు చేసిందన్నారు. గడిచిన అయిదేళ్ల వైకాపా పాలనలో నోటిఫికేష న్లు, జాబులు లేక అన్యాయానికి గురైన వారందరికీ ఈ రూపంలో న్యాయం చేసినందుకు ముఖ్య మంత్రి చంద్రబాబుకు వారంతా ధన్యవాదాలు తెలిపారు.(Story : కూటమిపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకం)