ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో “జీవవైవిధ్యం, పరిరక్షణ ” ఫై వెబినార్
న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్ష శాస్త్రం,జంతుశాస్త్రం, రసాయన శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో “జీవవైవిధ్యం, పరిరక్షణ” అనే అంశం ఫై నేషనల్ వెబినార్ నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె రత్న మాణిక్యం తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్రo, మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల ప్రభుత్వ కళాశాల వృక్ష శాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్. బి.సదాశివయ్య జీవవైవిధ్యం-పరిరక్షణ గురించి అవగాహన కల్పిస్తూ ప్రకృతిని,పర్యావరణాన్ని అనుసంధానిస్తూ ఔషధ మొక్కలైన ఉసిరి, మర్రి మొదలైన వాటి రసాయనిక ఉపయోగాలను వివరించడం జరిగింది. అంతరించిపోతున్న జంతు,వృక్ష జాతులను ఏవిధంగా పరిరక్షించాలి, ప్రకృతి లో వాటియొక్క ఆవశ్యకత గురించి వివరించడం జరిగింది.ఈకార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ముల్లి శేఖర్, అధ్యాపకులు జి.వెంకటరావు,డాక్టర్.వై.పద్మ,కె.శకుంతల, జి. సాయికుమార్
, యస్.అప్పనమ్మ, యం. నాగమోహనరావు,జి.హారతి,కె. శైలజ,కె శ్రీదేవి, కె.శ్రీలక్ష్మి, రాజబాబు,నూనె రమేష్, బి.శ్రీనివాసరావు తదితర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది,విద్యార్థినీ , విద్యార్థులు పాల్గొన్నారు. (Story : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో “జీవవైవిధ్యం, పరిరక్షణ ” ఫై వెబినార్)