ఆత్మకూర్లో భూ కబ్జాలపై ప్రత్యేక కమీషన్తో విచారణ జరిపించాలి : సిపిఐ
న్యూస్‌తెలుగు/వనపర్తి :ఆత్మకూరులో భూకబ్జాలపై ప్రత్యేక కమిషన్ వేసి విచారణ జరిపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు. సోమవారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిని కలిసి మాజీ ఎంపీపీ బంగారు శ్రీనివాసులు ఆత్మకూరు పట్టణం బాబా నగర్ కాలనీ టిఎన్జీవో భవన్ పక్కన 20 ఫీట్ల రోడ్డును ఆక్రమించి షాపులు నిర్మిస్తున్నారని కమీషనర్ టి పి ఓ ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఫిర్యాదు చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో 5 రోజులపాటు నిర్మాణాలు ఆపాలని, ఆక్రమణదారుపై చర్య తీసుకోవాలని నిరసన దీక్ష చేపట్టినా చర్య తీసుకోలేదని వారిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ ను కోరారు. ప్రభుత్వ భూములను సబ్ రిజిస్టర్ అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని దృష్టికి తెచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కబ్జాలపై కలెక్టర్కు వివరించామని తగు చర్య తీసుకుంటామని సానుకూలంగా స్పందించారన్నారు. ఆత్మకూరులో ప్రైవేట్ వెంచర్లు వేసినప్పుడు 10 శాతం భూమిని ప్రజల సౌకర్యం కోసం ఖాళీగా ఉంచగా, ఆ భూములను కొందరు కబ్జా చేశారన్నారు. స్మశాన వాటిక భూములను కూడా ఆక్రమించారన్నారు కబ్జా చేసిన భూములకు సబ్ రిజిస్టర్ అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్నారు. బంగారు శ్రీనివాసులు రోడ్డున ఆక్రమించి నిర్మిస్తున్న రెండు షాపుల నిర్మాణాన్ని ఆపాలని కమీషనర్ కు టౌన్ ప్లానింగ్ అధికారికి ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదని, నిర్మాణం కొనసాగుతూనే ఉందన్నారు. కారకులైన కమీషనర్ టిపిఓ సబ్ రిజిస్టార్ లను సస్పెండ్ చేయాలన్నారు. చర్య తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. సిపిఐ వనపర్తి పట్టణ కార్యదర్శి జే రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాలకృష్ణ ,శ్రీహరి, మండల నేతలు లక్ష్మీనారాయణ చిన్న కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.(Story : ఆత్మకూర్లో భూ కబ్జాలపై ప్రత్యేక కమీషన్తో విచారణ జరిపించాలి : సిపిఐ)