ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
న్యూస్ తెలుగు/ చింతూరు : ప్రభుత్వ జూనియర్ కళాశాల చింతూరు నందు మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.పరీక్షలు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు జరగనున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల చింతూరు, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల చింతూరు,కేజీబీవీ చింతూరు విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాల చింతూరు పరీక్షా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది.
ప్రధమ సంవత్సరం నందు 384 మంది, ద్వితీయ సంవత్సరం 297 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.విద్యార్థిని విద్యార్థులు అందరు గంట ముందుగా పరీక్షా కేంద్రం చేరుకుని ఎలాంటి ఇబ్బందీ లేకుండా శాంతియుత వాతావరణంలో పరీక్షలు రాయాలని పరీక్షా కేంద్రం చీఫ్ సూపరిండెంట్ ఎస్కె నాగుల్ మీరా, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ జీ. పెద్ద లు తెలియజేసారు. (Story : ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి)