హస్తినాపురంను మున్సిపాలిటీ పరిధిలో చేర్చి మౌళిక వసతులు కల్పించాలి
మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన హస్తినాపురం వాసులు..
న్యూస్ తెలుగు /వినుకొండ : పట్టణ సమీపంలోని వెల్లటూరు రోడ్డు పక్కన ఉన్న హస్తినాపురం వాస్తవ్యులు మునిసిపల్ కమిషనర్ ఎం. సుభాష్ చంద్రబోస్ ని కలిసి హస్తినాపురంను మునిసిపాలిటీలో కలిపి మౌళిక సౌకర్యాలను కలగజేయాలని మున్సిపల్ కమిషనర్ ని కోరారు. పట్టణంలో అత్యంత సుందరంగా 45 అడుగుల సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ కాలువలు, చుట్టూ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్, 16 సీసీ కెమెరాలు తో 24 గంటలు పర్యవేక్షణతో ఉన్న ఉన్న హస్తినాపురం వాస్తవ్యులు సుమారు 30 కుటుంబాలు నివసిస్తున్నారని కమిషనర్ కి తెలిపారు. విద్యుత్తు చెత్త సేకరణ, స్వీపర్స్ చేత పరిసరాలను శుభ్రం చెయ్యడం మరిన్ని వసతులు కలగజేయాలని కమిషనర్ ని కోరారు. కమిషనర్ వెంటనే స్పందించి వారంలో మునిసిపల్ పన్ను వేస్తామని ,చెల్లించే ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హస్తినాపురం అభివృద్ధి చేసిన ఎమ్మార్ డెవలపర్స్ అధినేత పుట్టి గంపల రామాంజనేయులు ( అంజిబాబు), బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బెజవాడ వెంకట నాగేశ్వరరావు, ప్రముఖ న్యాయవాది జెట్టి తిరుపతయ్య, లాం వెంకట్రావు, బేతపూడి హరిబాబు, జిల్లెల్లమూడీ.శ్రీనివాసరావు, షేక్ వలి, ఖజ్జాయం.ఈశ్వర్, ఆతుకూరి శ్రీనివాసరావు, నల్లబోతు శంకర్, తదితరులు ఉన్నారు. (Story : హస్తినాపురంను మున్సిపాలిటీ పరిధిలో చేర్చి మౌళిక వసతులు కల్పించాలి)