7000 అరుదైన వ్యాధులపై అవగాహనకు ‘రేస్ ఫర్ 7’
న్యూస్‌తెలుగు/న్యూదిల్లీ: నోవో నార్డిస్క్ ఇండియా సహకారంతో ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్ ఇండియా (ఓఆర్ డీఐ) అరుదైన వ్యాధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్‌లోని 21 నగరాల్లో ‘రేస్ ఫర్ 7’ అవేర్నెస్ రన్ 10వ ఎడిషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. అరుదైనవ్యాధులతో ఉన్నవారు, సంరక్షకులు, హెల్త్ కేర్నిపుణులు, పాలసీమేకర్లు అందరూ కలిసి అరుదైన వ్యాధులతో నివసించే వ్యక్తులకు మెరుగైన ఆరోగ్యసంరక్షణ అందించడం కోసం ముందడుగు వేసిన ఈ కార్యక్రమానికి అపూర్వస్పందన లభించింది. భారతదేశంలో అరుదైన వ్యాధులు రాకుండా నివారణ చికిత్స ప్రత్యామ్నాయాల అవసరాన్ని నొక్కి చెబుతూ, విక్రాంత్ శ్రోత్రియా – నోవో నార్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ, భారతదేశంలో ప్రబలంగా ఉన్న అరుదైన రక్తస్రావం వ్యాధి, ఇతర అరుదైన వ్యాధులను నిరంతర అవగాహన, ప్రారంభంలోనే తొందరగా గుర్తించి, సమర్థవంతమైన చికిత్స ద్వారా మాత్రమే ఎదుర్కోవచ్చునని అన్నారు. (Story : 7000 అరుదైన వ్యాధులపై అవగాహనకు ‘రేస్ ఫర్ 7’)