వినకొండ లో పొలం పిలుస్తుంది కార్యక్రమం
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ పరిధిలోని ఏనుగుపాలెం రైతు సేవ కేంద్రంలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి జి. వరలక్ష్మి మాట్లాడుతూ. వరి ,కంది, మిరప ,పొగాకు ,పంటలను తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలని అని తెలిపారు. మద్దతు ధరలు, కొనుగోలు కేంద్రాల మీద రైతులకు అవగాహన చేయడం జరిగింది. మొక్కజొన్న పంట పొలాలను పరిశీలించి వాటిలో ఉన్న పురుగులు, తెగుళ్ల గురించి రైతులకు అవగాహన కల్పించారు. రబీ లో పంట నమోదు చేసిన పొలాలను పరిశీలించారు. ప్రతి ఒక్క రైతు సోదరులు ఏపీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా రైతు సేవ కేంద్రం వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేపించుకోవాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేపించుకున్న రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ ,పీఎం కిసాన్ తదితర వ్యవసాయ శాఖ సంబంధించిన అన్ని రకాల పథకాలు వర్తిస్తాయి అని అన్నారు. పెండింగ్ వున్న వారు అలాగే మీ ఆధార్ కి బ్యాంక్ లింక్ లేని వారు పోస్టల్ అకౌంట్ ఓపెన్ చేసుకోవలన్నారు. త్వరగా కంప్లీట్ చేసుకోవాలని,చేసుకొంటే వెంటనే నగదు వారి ఖాతా లో పడుతుందని చెప్పటం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి. వరలక్ష్మి ,అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సునీత, గ్రామ వ్యవసాయ సహాయకులు టి. యస్వంత్, రైతు సోదరులు పాల్గొన్నారు.(Story : వినకొండ లో పొలం పిలుస్తుంది కార్యక్రమం )