అంగన్వాడి ఆధ్వర్యంలో జ్ఞాన జ్యోతి కార్యక్రమం
న్యూస్ తెలుగు / వినుకొండ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్స్ కు అందిస్తున్న జ్ఞాన జ్యోతి కార్యక్రమం 5వ రోజుకు చేరుకున్నాయి. వినుకొండ పట్టణంలోని 9వ వార్డు పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న ఈ జ్ఞాన జ్యోతి కార్యక్రమం రీసెర్చ్ పర్సన్స్ పి. ప్రకాష్ రావు, తో ఏ సెక్టార్ సూపర్వైజర్ శేషు కుమారి, ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి
వినుకొండ మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫ్రుల ముఖ్యఅతిథిగా పాల్గొని టీచర్స్ చేసిన వివిధ నమూనాలను పరిశీలించి విద్యార్థులకు ఎలా ఉపయోగపడతాయి అనే దానిమీద అంగనవాడి టీచర్స్ కు, అలాగే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వివరించారు. ఇదే విషయంపై ప్రకాష్ రావు, ఏ సెక్టర్ సూపర్వైజర్ శేషు కుమారి, ఈ కార్యక్రమం ఒక ఉద్దేశాన్ని వివరించగా కార్యక్రమంలో పొందిన ప్రయోగాలను అంగనవాడి టీచర్స్ కు వివరించారు. తొమ్మిదో వార్డు పరిధిలో శిక్షణ పొందిన ఏ సెక్టర్ అలాగే కొత్తపాలెం సెక్టర్ అంగనవాడి టీచర్ కు ఎంఈఓ జఫిల్ల్లా ప్రత్యేకంగా అభినందించారు. చిన్నారులకు సమగ్ర అభివృద్ధి చెందడానికి ఈ కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఎంఈఓ వెల్లడించారు. (Story : అంగన్వాడి ఆధ్వర్యంలో జ్ఞాన జ్యోతి కార్యక్రమం)