అల్లు ఎరుకు నాయుడు సేవలు చిరస్మరణీయం
న్యూస్ తెలుగు /సాలూరు : సాలూరు పట్టణానికి మాజీ ఎమ్మెల్యే అల్లు ఎరుకు నాయుడు ఎంతో సేవ చేశారని అలాంటి వారిని సాలూరు పట్టణ ప్రజలు గుర్తించుకోవాలని. ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. సోమవారం నాయుడు వీధి లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఎరుకునాయుడు 2వ ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం అని అన్నారు.. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాలూరు అభివృద్ధి చెందిందని అన్నారు. మొదట 1955లో జరిగిన ఎన్నికల్లో సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం(జనరల్) నుంచి ఎమ్మెల్యేగా ప్రజా సోషలిస్ట్ పార్టీ తరుపున అల్లు ఎరుకు నాయుడు పోటీ చేసి ఓటమి చెందారని. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో జనరల్ కేటగిరీ లో కూనిశెట్టి.నారాయణ దొర తో పోటీ చేసి ఎరుకునాయుడు ఓటమి చెందారని అన్నారు.తిరిగి 1962 సం.లో జరిగిన ఎన్నికల్లో శ్రీ రాజా లక్ష్మీనరసింహ నారాయణ రాజు తో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారని అన్నారు.ఈయన సాలూరు నియోజక వర్గానికి 2వ ఎమ్మెల్యే కావడం విశేషం ఆ ఎన్నికల తరువాత సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎస్టీ నియోజక వర్గం గా మారి నేటికి అదే కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ పట్టణ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్ గొర్లి జగన్ మోహన్ రావు, వైసిపి నాయకులు పిరిడి రామకృష్ణ తాడ్డి శంకర్రావు. మండల ఈశ్వరరావు, వారి కుటుంబ సభ్యులు అల్లు శ్యామ్ గునుపూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు.(Story : అల్లు ఎరుకు నాయుడు సేవలు చిరస్మరణీయం)