వాసవి హైస్కూల్ లో చిత్రకళా ప్రదర్శన
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక వాసవి హైస్కూల్ లో జరిగిన చిత్రకళా పండుగలోని కొన్ని దృశ్యాలు, ఉదయం 10 గంటలకు వినుకొండ మండల విద్యాశాఖాధికారి సయ్యద్ జఫ్రుల్లా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ చిత్రకళా ప్రదర్శనలో పావస్ చిత్రకారులు గీసిన చిత్రాలను వినుకొండ నియోజకవర్గంలోని విద్యా సంస్థలు, వందలాది విద్యార్థులు తిలకించారు. ఇదే సమయంలో ఆర్ట్ క్యాంపు ప్రారంభమైంది. 25 మంది చిత్రకారులు స్పాట్ లో బొమ్మలు గీసి అబ్బురపరిచారు. డా.వజ్రగిరి జెస్టిస్ వందలాది విద్యార్థులు ఎదుట ఆర్ట్ డెమో చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిత్రకారులు పిరమిడ్ రాజు , కోటి , విజయవర్ధన్ వారి గానంతో అలరించారు. పావస్ గౌరవాధ్యక్షులు న్యాయవాది పి.జె.లూకా, చిత్రకారులు నారాయణ చిత్రకళా విశేషాలు వివరించారు. అపకా అధ్యక్షులు వర్ధనరావు గోడపై అధ్భుతమైన చిత్రకళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పావస్ కార్యదర్శి పఠాన్ ఖాసిం గోడపై ముచ్చటైన అక్షరాలు లిఖించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పెయింటింగ్ ఆర్టిస్ట్స్, పెద్దల సమావేశం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళే విధివిధానాలు రూపొందించారు.
డా.వజ్రగిరి జెస్టిస్ అధ్యక్షతన సాయంత్రం జరిగిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జి వి ఆంజనేయులు కి తదితర నాయకులకు చిత్రకారులు మెమోరాండం ఇవ్వడం జరిగింది. సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న ఆంజనేయులు వినతి పత్రం ప్రభుత్వ పరిశీలనకు పంపిస్తామని చెప్పారు. అనారోగ్యం పాలైన పావస్ చిత్రకారుడు మాలకొండయ్య గురించి మాట్లాడుతూ. వజ్రగిరి జెస్టిస్ కన్నీళ్ళపర్యంతమయ్యారు. తను చిత్రించిన ”ఉషోదయం ” చిత్రం కొనుగోలు చేయటం ద్వారా వచ్చిన డబ్బును మాలకొండయ్య కి పంపిస్తానని ప్రకటించగా,
వెంటనే స్పందించిన జి.వి ఆంజనేయులు వారి సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ అధినేత శ్రీమతి లీలావతి చిత్రాన్ని కొనుగోలు చేసి డబ్బులు అందించి తమ దాతృత్వం మరోసారి చాటుకున్నారు. తదనంతరం డాక్టర్ పి.వి. సురేష్ బాబు కి, మాతంగి సాంబశివరావు కి ఘనమైన సత్కారం జరిగింది. పిరమిడ్ రాజు సహకారంతో.. వజ్రగిరి జెస్టిస్ చిత్రించిన వారి చిత్రాలు జి వి ఆంజనేయులు చేతుల మీదుగా వారికి అందించారు. తదుపరి
చిత్రకళా పోటీలలో పాల్గొన్న విద్యార్ధులకు బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన వినుకొండ మున్సిపల్ చైర్మపర్సన్ షకీలా దస్తగిరి , మద్దు వెంకటస్వామి, కూచి రామాంజనేయులు కేశవసూరి తదితర పెద్దల సమక్షంలో కార్యక్రమంలో పాల్గొన్న చిత్రకారులను, పోలో కలర్ వారిని వాసవి హైస్కూల్ అధినేత నాగోతు అనిల్ కుమార్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఎందరో దాతల సహకారంతో.. నిజంగా పండగలా జరిగిన ఈ కార్యక్రమానికి ఎంతో సహాయ, సహకారాలు అందించిన వాసవి హైస్కూల్ స్టాఫ్ ను జివి ఆంజనేయులు ప్రత్యేకంగా అభినందించారు . (Story : వాసవి హైస్కూల్ లో చిత్రకళా ప్రదర్శన)