అంగన్వాడి శిక్షణ శిబిరాన్ని సందర్శించిన ఎంఈఓ
న్యూస్ తెలుగు/ చింతూరు : అంగన్వాడీ ఉద్యోగులకు 120 రోజుల సర్టిఫికెట్ కోర్సు (జ్ఞానజ్యోతి) శిక్షణా కార్యక్రమం లో భాగంగా రెండవ రోజు స్ధానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల చింతూరు,చింతూరు మండలం నందు మండల విద్యాశాఖాధికారి వి. లక్మి నారాయణ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు . ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలను ఉద్దేశించి ఎంఈఓ మాట్లాడుతూ సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కె బాలకృష్ణ,ఐసీడీఎస్ సూపర్వైజర్ సంఘమిత్ర, డి ఆర్ పి లు, బి.ముత్తయ్య,ఇర్మరాజు, పార్వతి, మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. (Story : అంగన్వాడి శిక్షణ శిబిరాన్ని సందర్శించిన ఎంఈఓ)

