మహిళలు అక్షరాస్యత కలిగి ఉండాలి ఎస్సై రమేష్
న్యూస్ తెలుగు /చింతూరు : చదువుకున్న మహిళలు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటి తో పాటు గ్రామం, బాగుపడుతుందని చింతూరు యస్ ఐ రమేష్ పేర్కొన్నారు. చింతూరులోని శాపిడ్ స్వచ్చంద సంస్థ ఏర్పాటుచేసిన అన్ని రంగాల్లో మహిళలు లీడర్ షిప్ సాధించడం అనే అంశం పై యస్ ఐ మాట్లాడారు. చదువుతో అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు గురించి, బాల్య వివాహాలు , మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై సోదాహరణంగా వివరించారు. అలాగే మహిళలు మావోయిస్ట్ భావజాలం పై మొగ్గు చూపగూడదని, వారికి సహకరించకూడదని, వారికి సహకరిస్తే నేరస్తులు అవుతారని అన్నారు. మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. స్త్రీల వ్యాధులు వాటి నివారణ గూర్చి ప్రభుత్వ వైద్యశాల గైనకాలజిస్ట్ వెంకట రమణ మాట్లాడారు. పొదుపు పథకాలు, డిపాజిట్లు గూర్చి ఎస్బిఐ ఎర్రంపేట మేనేజర్ ప్రసన్న కుమార్ మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో శాపిడ్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ అహ్మద్ అలీ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి మహిళా సంఘం సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.(Story : మహిళలు అక్షరాస్యత కలిగి ఉండాలి ఎస్సై రమేష్ )