ఆలపాటి రాజాకు ఓటు వేసి గెలిపించండి
ప్రభుత్వ చీఫ్ విప్ జీవి
న్యూస్ తెలుగు /వినుకొండ : కృష్ణ- గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు పట్టభద్రులందరూ తమ అమూల్యమైన ఓటును వేసి, వేయించి గెలిపించాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కోరారు. మంగళవారం ఉదయం వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల, నరసరావుపేట రోడ్డులోని సాయిబాబా గుడి వాకింగ్ ట్రాక్ వద్ద చీఫ్ విప్ జీవి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. (వాకర్స్) ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులను కలిసి అలపాటి రాజేంద్రప్రసాద్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు. అలాగే నరసరావుపేట రోడ్ లోని ‘టీ’ స్టాల్స్ వద్ద ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు, జనార్ధన్, జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్, బిజెపి నాయకులు లెనిన్ తో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.(Story: ఆలపాటి రాజాకు ఓటు వేసి గెలిపించండి)