Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పాన్ ఇండియా సైబర్‌ నేరగాళ్లు అరెస్ట్‌

పాన్ ఇండియా సైబర్‌ నేరగాళ్లు అరెస్ట్‌

0

పాన్ ఇండియా సైబర్‌ నేరగాళ్లు అరెస్ట్‌

` దేశవ్యాప్తంగా ముఠాపై 213 పిర్యాదులు

` రూ.4 కోట్ల మేర దేశవ్యాప్తంగా మోసం చేసిన సైబర్‌ ముఠా` తాజాగా రూ.1.64 లక్షలు ప్రభుత్వ పథకాలు ఆశచూపి మోసం చేస్తూ పట్టుబడిన వైనం

` ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

` జిల్లా ఎస్పీ తుషార్‌డూడి

న్యూస్ తెలుగు/బాపట్ల : ప్రభుత్వ పథకాల పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఫోటో డీపీగా పెట్టుకుని సైబర్‌ నేరాలకు పాల్పడుతన్న ముఠా సభ్యులు బాపట్ల జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకుని కటాకటాలకు వెనక్కి పంపారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ తుషార్‌డూడి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చీరాల రెండు పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జనని సురక్ష యోజన పధకం పేరుతో ఆనంద్‌పేటకు చెందిన మహిళలకు కాల్‌ చేసి మోసం చేశారంటూ పిర్యాదు అందింది. చీరాల ఆనంద పేటకు చెందిన ఫిర్యాదికి సైబర్‌ మోసగాళ్ళు కాల్‌ చేసి తనకు తాను ఆరోగ్య శాఖ ప్రతినిధిగా అంటూ పాలిచ్చే తల్లుల కోసం ముఖ్యమంత్రి జనని సురక్ష పథకం కింద రూ. 70 లక్షలు కేటాయించారని నమ్మించాడు. కాల్‌ చేసిన వ్యక్తి ఫిర్యాది పరిధిలోని వ్యక్తుల ఫోన్‌ నంబర్లను తీసుకొని వ్యక్తులను సంప్రదించి మాయమాటలతో ప్రలోభ పెట్టి ఫోన్‌పే ద్వారా డబ్బు బదిలీ చేయమని వారిని ఒప్పించాడు. దీంతో మొత్తం ముగ్గురు బాధితుల నుండి రూ.1,64,724 లక్షల నగదును మోసపూరితంగా బదిలీ చేయించుకున్నాడని పిర్యాదు చేశారు. ముద్దాయిలు ఒక ముఠాగా ఏర్పడి ఆన్‌ లైన్‌లో ప్రభుత్వం ద్వారా వస్తున్న ప్రకటనలను గమనించి వాటి సారాంశం తెలుసుకొని దానికి సంబంధించిన ఉద్యోగస్తులకు ఫోన్లు చేసి ఆ ప్రకటనకు సంబంధించిన అధికారులమని వారిని నమ్మబలికి, ప్రభుత్వం నుండి నగదు బదిలీ చేస్తామని వారి ఫోన్‌ పే అకౌంట్‌లోని యూపీఐ ఐడి ని తెలుసుకొని యూపీఐ ఐడిని సైబర్‌ నేరస్తులు బ్లింకింట్‌ అనే ఆన్లైన్‌ డెలివరీ అప్లికేషన్‌ ద్వారా అనేక రకాలైన వస్తువులను కొని వాటి రుసుమును బాధితుల అకౌంట్‌ నుండి బదిలీ అయ్యేలాగా సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నారు. బ్లింకిట్‌ యాప్‌ ద్వారా కొనుగోలు చేసిన వస్తువులను రకరకాల అడ్రస్‌లకు పెట్టి , వాటిని సేకరించి తక్కువ ధరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటారు. సైబర్‌ నేరగాళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోను వాట్స్‌ యాప్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌గా పెట్టుకొని ప్రభుత్వ పథకాల్లో భాగంగా జనని సురక్ష యోజన పథకం ద్వారా బాలింతలకు డబ్బులు బదిలీ చేస్తామని చెప్పి చీరాల రెండవ పట్టణ పరిధిలోని అంగన్వాడీ టీచర్లను, బాలింతలను మోసం చేసి వారి అకౌంట్లో ఉన్న ఒక రూ.1,64,724 బ్లింకిట్‌ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఈ నేపధ్యంలో కేసును సవాల్‌గా తీసుకున్న ఎస్పీ తుషార్‌డూడి
వరుసగా జరుగుతున్న సైబర్‌ నేరాలను దృష్టిలో ఉంచుకొని చీరాల 2వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన కేసు చేదనకు బాపట్ల ఐటి కోర్‌ ఎస్‌.ఐ షేక్‌.నాయుబ్‌ రసూల్‌ ఆధ్వర్యంలోని టెక్నికల్‌ బృందం ఇచ్చిన సమాచారం మేరకు చీరాల 2వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఇన్స్పెక్టర్‌ బి.నాగభూషణం నేతృత్వంలో ఒక బృందంను ఢల్లీికి పంపించారు. ఢల్లీి కి వెళ్ళిన బృందం నేరగాడు జతిన్‌ ను పట్టుకుని అరెస్ట్‌ చేసి అతని వద్ద నుండి ఒక ఫోన్‌ ను సీజ్‌ చేసి ఈ కేసుతో సంబంధం ఉన్నా మిగిలిన అనుమానితుల వివరాలను సేకరించారు.ఈ కేసులో ముద్దాయిల వద్ద నుండి రూ.1,90,000 లక్షల నగదు, 3 సెల్‌ ఫోన్లను 15 సిమ్‌కార్డులు, 2 ఏటీఎం లు , 4 బ్యాంక్‌ ఖాతా పుస్తకాలను దర్యాప్తులో బాగంగా మధ్యవర్తుల సమక్షంలో సీజ్‌ చేశామని తెలిపారు. వీరిపై దేశంలో 6 రాష్ట్రాలోని పలుపోలీస్‌ స్టేషన్‌లలో 94 సైబర్‌ ఫిర్యాదులు నమోదు అయినట్లు, వీరు లక్షల రూపాయల మోసానికి పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు. బాధితులకు 5 ఫోన్‌ నంబర్‌లను ఉపయోగించి సైబర్‌ నేరస్థుల నుండి కాల్స్‌ వచ్చాయి. సమన్వయ పోర్టల్‌లో శోధించగా అనుమానితులపై 36 ఫిర్యాదులు కనిపించాయి, మొత్తం రూ. 16,02,403 నగదు దోచుకున్నారు. నిందితులు ఢల్లీిలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి వారి సైబర్‌ క్రైమ్‌ కార్యకలాపాలను నిర్వహించారు. కాల్‌ డేటా విశ్లేషించగా ఈ ఫోన్‌ నంబర్‌లకు అనుసంధానించబడిన 7 ఐఎమ్‌ఈఐ నంబర్‌లను గుర్తించారు. లోతైన దర్యాప్తులో నేరస్థులు 96 సిమ్‌ కార్డులను ఉపయోగించినట్లు వెల్లడైంది. నిందితులు మొత్తం 96 సిమ్‌ కార్డులను ఉపయోగించి 132 మందిని మోసం చేశారు (ఆంధ్రప్రదేశ్‌లో – 107, తెలంగాణ – 12 ఉత్తర ప్రదేశ్‌ – 3, రాజస్థాన్‌ -7 జార్కాండ్‌ – 3 మొత్తం రూ.66,00,000 లక్షలు మోసగించడం జరిగింది. సమన్వయ పోర్టల్‌ పరిశీలించగా రాజస్థాన్‌ లో (7), ఉత్తర ప్రదేశ్‌ లో (3), మరియు జార్కండ్‌ లో (2) మొత్తం 12 ఐటీ కేసులలో నిందితుడి మొబైల్‌ నంబర్‌ లింక్‌ చేయబడిరదన్నారు. నిందితులు గతంలో పోరుమామిళ్ల, కడప టౌన్‌లలో సైబర్‌ మోసం కేసులలో జనవరి 2023లో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినప్పుడు, పోలీసులు అనేక బ్యాంకు ఖాతాలు మరియు సిమ్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. సమన్వయ పోర్టల్‌ శోధనలో 20 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాలలో వీరి పై మొత్తం 213 కేసులు నమోదయ్యాయి, సుమారు రూ.4 కోట్లు మోసం చేశారని తెలిపారు. జిల్లా ఎస్పీ ప్రజలని ఉద్దేశించి మాట్లాడుతూ అపరిచితులను నమ్మి మోసపోవద్దని, సైబర్‌ నేరస్తులు రక రకాలుగా ప్రజలను మోసం చేస్తున్నారని, ఇటువంటి మోసాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా నిత్యం పోలీస్‌ శాఖ ద్వారా అనేక రకాల అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఎవరైనా ప్రభుత్వ పథకాల పేరుతొ మీకు కాల్‌ చేస్తే సంబంధిత అధికారులను సంప్రదించాలని, దగ్గరలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌ కు సమాచారం అందించాలని సూచించారు. అపరచిత లింక్‌లను క్లిక్‌ చెయ్యవద్దని తెలిపారు. సైబర్‌ నేరాలకు గురైనట్లయితే వెంటనే 1930 కు కాల్‌ చేసి తెలపాలని, సహాయం చేసేందుకు బాపట్ల జిల్లా టెక్నికల్‌ బృందం ఎల్లప్పుడు సిద్దంగా ఉంటారని జిల్లా ఎస్పీ తెలిపారు.అనంతరం కేసు దర్యాప్తులో, ఛేదనలో విశేష కృషి చేసిన చీరాల 2 టౌన్‌ సిఐ బి. నాగభూషణం, ఆర్‌.ఐ టి. శ్రీకాంత్‌, ఐ.టి కోర్‌ టెక్నికల్‌ టీం ఎస్‌.ఐ షేక్‌. నయాబ్‌ రసూల్‌, చీరాల 2 టౌన్‌ ఎస్‌.ఐ నాగశ్రీను, ఐ.టి కోర్‌ టెక్నికల్‌ టీం కానిస్టేబుళ్లు డి. సురేష్‌, కె. రాము, మహిళా కానిస్టేబుళ్లు ఐ. కీర్తి, డి. తబితలను జిల్లా ఎస్పీ అభినందించి, క్యాష్‌ రివార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో చీరాల డిఎస్పీ మోయిన్‌, చీరాల 2 టౌన్‌ సిఐ బి. నాగభూషణం, ఆర్‌.ఐ టి. శ్రీకాంత్‌, ఐ.టి కోర్‌ టెక్నికల్‌ టీం ఎస్‌.ఐ షేక్‌. నయాబ్‌ రసూల్‌ ఇతర పోలీస్‌ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.(Story : పాన్ ఇండియా సైబర్‌ నేరగాళ్లు అరెస్ట్‌ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version